పాటలు కావచ్చు, నేపథ్య సంగీతం కావచ్చు... ఇప్పుడు తమన్ హవా నడుస్తోంది. ప్రతి సినిమాకూ తమన్ హిట్ సాంగ్స్ ఇస్తున్నారు. సన్నివేశాలకు తగ్గట్టు నేపథ్య సంగీతం అందిస్తున్నారు. అయితే... 'భీమ్లా నాయక్' ట్రైల‌ర్‌కు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు అంతగా ఆకట్టుకోలేదని చెప్పాలి. దీనికి కారణం కూడా తమనే. టీజర్‌కు ఆయన అందించిన నేపథ్య సంగీతం విపరీతంగా ఆకట్టుకుంది.


'భీమ్లా నాయక్' టీజర్ విడుదలైన తర్వాత థియేటర్లలోకి వచ్చిన 'అఖండ', 'డీజే టిల్లు' సినిమాలకు తమన్ ఎక్స్ట్రాడిన‌రీ రీ-రికార్డింగ్ అందించారు. అందుకని, 'భీమ్లా నాయక్' ట్రైలర్ విషయంలో ఇంకా ఎక్కువ ఆశించారు. కొంచెం డిజప్పాయింట్ అయినట్టు ఉన్నారు. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు చెప్పారు. అవి తమన్ దృష్టికి వెళ్లినట్టు ఉన్నాయి. ఆయన మంగళవారం ఉదయం చేసిన ట్వీట్ చూస్తే... అలాగే ఉంది.


''థియేటర్లలో రాంప్ అమ్మా! అన్ని ట్రైలర్ లో ఎక్స్‌పెక్ట్ చేస్తే ఎలా? అడవిలో మంటకు, లోకల్ మంట (చలిమంట?)కు తేడా ఉండాలిగా! కలుద్దాం... ఈ నెల 25న థియేటర్లలో 'భీమ్లా నాయక్'తో'' అని తమన్ ట్వీట్ చేశారు. దీన్నిబట్టి రీ-రికార్డింగ్‌కు థియేటర్లు దద్దరిల్లడం ఖాయం అన్నమాట.


Also Read: వైసీపీతో త్రివిక్రమ్ ప్లాన్? అందుకే, 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్‌కు బండ్ల గణేష్ దూరమా? లీక్డ్ ఫోన్ కాల్‌లో నిజమెంత?






పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా దగ్గుబాటి సరసన సంయుక్తా మీనన్ నటిస్తున్న 'భీమ్లా నాయక్'ను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా... త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చారు. ట్రైల‌ర్‌కు వచ్చిన మిశ్రమ స్పందన పక్కన పెడితే... ఆల్రెడీ యూట్యూబ్‌లో 12 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 


Also Read: గొడవ సెటిల్ అయిపోయినట్లేనా? బుక్ మై షోలో 'భీమ్లా నాయక్'