ళపతి విజయ్ హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘వారిసు’. తెలుగులో ఈ సినిమాను ‘వారసుడు’ పేరుతో విడుదల చేశారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మించారు.  ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.


ఫిబ్రవరి 10 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్


కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘వారిసు’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ చిత్రం కోలీవుడ్‌ సహా తెలుగులోనూ పాజిటివ్‌ రెస్పాన్స్‌ ను సొంతం చేసుకుంది. వసూళ్ల పరంగానూ అదుర్స్ అనిపిస్తోంది. థియేటర్లలో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ హక్కులను  అమెజాన్ ప్రైమ్‌ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాట దళపతి విజయ్‌కు ఉన్న ఫాలోయింగ్‌ నేపథ్యంలో భారీ ధరకు అమెజాన్‌ ‘వారిసు’ రైట్స్ దక్కించుకుందట. అంతేకాదు, విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫిబ్రవరి 10 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి రానున్నట్లు తెలుస్తోంది. అయితే, త్వరలోనే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక థియేటర్లలో ఈ సినిమా చూడని సినీ లవర్స్ ఓటీటీలో చూసేందుకు రెడీ అవుతున్నారు.  


రూ. 110 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న విజయ్


‘బీస్ట్’, ‘మాస్టర్’, ‘బిగిల్’ లాంటి కమర్షియల్ హిట్స్ తర్వాత తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ మెయిన్ రోల్ లో యాక్షన్ డ్రామాగా ‘వారిసు’ తెరకెక్కింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శరత్‌ కుమార్, ప్రకాష్ రాజ్‌, శ్రీకాంత్ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు. రూ. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కోసం ఆయా నటీ నటులు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నారు. తన కెరీర్ లోనే విజయ్ ఈ సినిమాకు అత్యధికంగా రెమ్యునరేషన్ అందుకున్నారు. ఏకంగా రూ. 110 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని ఇతర నటీనటులు సైతం భారీగానే డబ్బులు తీసుకున్నారు.










Read Also: ఆస్కార్ రేసులో ఎన్టీఆర్ దూకుడు, హాలీవుడ్ స్టార్స్‌ను సైతం వెనక్కి నెట్టి...