రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘RRR’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. వసూళ్ల పరంగానే కాకుండా, ప్రతిష్టాత్మక అవార్డుల పరంగానూ దుమ్మురేపుతోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ సహా పలు అవార్డులను దక్కించుకున్న ఈ చిత్రం ఆస్కార్ అవార్డుల కోసం ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో ‘RRR’ టీమ్ కు అదిరిపోయే వార్త చెప్పింది ‘యుఎస్ఏ’ టుడే. ఆస్కార్ రేసులో నిలిచిన టాప్ 10 హీరోస్ లిస్టులో జూ.ఎన్టీఆర్‌కు నెంబర్ వన్ స్థానాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా జూ.ఎన్టీఆర్ పేరు మార్మోగుతోంది.  


కొనసాగుతున్న ఆస్కార్ ఓటింగ్


ఇండియా నుంచి ‘RRR’ మూవీ అధికారికంగా ఎంట్రీ దక్కించుకోలేకపోయినా, ఇండిపెండెంట్ కేటగిరీలో నామినేట్ అయ్యింది. ప్రస్తుతం ఆస్కార్ ఓటింగ్ కొనసాగుతోంది. ఆస్కార్ ఓటర్లు తమ నామినేషన్స్ ను అకాడమీ అవార్డులకు పంపుతున్నారు. ఇప్పటికే ఏఆర్ రెహమాన్ సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆస్కార్ నామినేషన్స్ అధికారికంగా ప్రకటించడానికి ముందు అమెరికాకు చెందిన పలు మీడియా సంస్థలు సర్వేలు నిర్వహించి ఆస్కార్ నామినేషన్ జాబితాలను విడుదల చేస్తున్నాయి.  






జూ.ఎన్టీఆర్‌కు అగ్రస్థానం


తాజాగా యుఎస్ఎ టుడే పోర్టల్ ఆస్కార్ రేసులో నిలిచే టాప్ 10 హీరోల లిస్టును విడుదల చేసింది. ఇందులో ఎన్టీఆర్ కు టాప్ ప్లేస్ ఇచ్చింది. అమెరికాలోనే ప్రముఖ పత్రికగా కొనసాగుతున్న యుఎస్ఎ టుడే ఇండియన్ యాక్టర్ కు టాప్ ర్యాంక్ ఇవ్వడం సంచలనం కలిగిస్తోంది.


యుఎస్ఎ టుడే టాప్-10 బెస్ట్ యాక్టర్స్ లిస్టు ఇదే


1. జూ.ఎన్టీఆర్(ఆర్ఆర్ఆర్)
2. టామ్ క్రూజ్ (టాప్ గన్: మావెరిక్)
3. పాల్ డానో (ద బ్యాట్‌మేన్)
4. మియా గోత్ (పెర్ల్)
5. నైనా హాస్ (టార్)
6. జియో క్రావిట్జ్ (కిమి)
7. లాషనా లించ్(ద ఉమెన్ కింగ్, మటిల్డా ద మ్యూజికల్)
8. పాల్ మెస్కల్ (ఆఫ్టర్‌సన్)
9. కెకె పామర్ (నోప్)
10. జెరెమీ పోప్ (ద ఇన్‌స్పెక్షన్)


జూ. ఎన్టీఆర్ ఎందుకు నామినేట్ అయ్యారంటే?


ఈ సందర్భంగా ‘RRR’ మూవీపై USA Today పోర్టల్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ చిత్రాన్ని యాక్షన్ ప్యాక్డ్ మ్యూజికల్ అడ్వెంచర్‌ గా ప్రకటించింది. ఈ సినిమాను ఇద్దరు ఇండియన్ యాక్టర్స్ ఆడియన్స్ ఫ్రెండ్లీ పవర్‌ హౌస్‌గా మార్చారని ప్రశంసించింది. ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా ఫైట్లు, డాన్సులు చేశారని తెలిపింది. అయినప్పటికీ, ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే సెలెక్ట్ చేయాలి కాబట్టి.. క్రూర జంతువులను పోషించడం, మోటార్ సైకిల్ లాంటి అడ్వెంచర్స్ చేయడం వల్ల జూ.ఎన్టీఆర్ ను నామినేట్ చేసినట్లు వెల్లడించింది.


Read Also: బొమ్మల పుస్తకంగా ‘RRR’ సినిమా, కొడుకుపై ప్రేమతో ఆ తండ్రి ఏం చేశాడో చూడండి