తమిళ స్టార్ హీరో విజయ్ కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు ఇక్కడ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాయి. దాదాపు ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులో కూడా విడుదల అవుతాయి. విజయ్ తాజాగా నటించిన సినిమా తెలుగులో ' వారసుడు' గా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి మూవీ టీమ్ ఓ కొత్త అప్డేట్ ను ఇచ్చింది. సినిమా మొదటి ప్రోమోను ఈరోజు సాయంత్రం విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. 


దళపతి విజయ్‌కు ప్రస్తుతం అటు కోలీవుడ్లో ఇటు టాలీవుడ్లోనూ మంచి డిమాండ్ ఉంది. విజయ్ సినిమాలు 'తుపాకీ', 'సర్కార్', 'విజిల్', 'మాస్టర్', 'బీస్ట్', వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అదే వరుసలో ఇప్పుడు తమిళ్‌లో ఆయన నటిస్తోన్న సినిమా తెలుగులో 'వారసుడు' గా కూడా విడుదల చేస్తున్నారు. విజయ్ నటించిన ఇంతకుముందు సినిమాలు మాస్టర్, బీస్ట్ పాజిటివ్ టాక్‌ను తెచ్చుకున్నాయి. అయితే ఈసారి వారసుడుతో కూడా హిట్ కొట్టాలని అనుకుంటున్నారట విజయ్. ప్రస్తుతం  ఈ సినిమా కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ రోజు సినిమా ఫస్ట్ సింగిల్ ప్రోమో‌ను సాయంత్రం 6:30 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది మూవీ టీమ్. దీంతో విజయ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రోమో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. 


తమిళ నటులు చాలా మంది ముందు నుంచీ తెలుగు ఆడియన్స్‌కు దగ్గరవ్వడానికి సినిమాలు ఇక్కడ కూడా విడుదల చేస్తున్నారు. రజినీకాంత్ విక్రమ, సూర్య, కమల్ హాసన్,కార్తి, విశాల్ ఇలా అందరూ కూడా వరుసగా తెలుగులో ప్రమోషన్స్ చేసి సినిమాలు విడుదల చేస్తున్నారు. అయితే విజయ్ మాత్రం కాస్త లేటుగా తెలుగులో ఎంట్రీ ఇచ్చారనే చెప్పాలి. ఇప్పుడిప్పుడే విజయ్ కు క్రేజ్ వస్తోంది. ఇప్పుడు దీన్ని వాడుకొని బిజినెస్ చేయాలని చూస్తున్నారట ఈ సినిమా నిర్మాత దిల్ రాజు. అటు ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ కూడా భారీ రేంజ్‌లో జరగడంతో తెలుగులో తానే తీసుకుని సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారట.


ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ పెట్టి తీస్తున్నారట నిర్మాత దిల్ రాజు. విజయ్ కు కూడా భారీ పారితోషకమే ఇచ్చారని టాక్. ఈ సంక్రాంతికే 'వారసుడు'ని రంగంలోకి దించుతున్నారని ఇప్పటికే ప్రకటించారు. సంక్రాంతి బరిలోకి దిగడం అంటే సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే అప్పుడే ఇక్కడ పెద్ద హీరోల సినిమాలు కూడా విడుదల అవుతాయి. మరి ఈ పోటీలో విజయ్ వారసుడు నిలబడతాడో లేదో చూడాలి. అటు తమిళ్‌లోనూ వారసుడుకి అదే పోటీ ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. సంక్రాంతి సందర్భంగా సినిమా విడుదల చేయనున్నారు.