Leharaayi Song: 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' లెహరాయి సాంగ్ కి మిలియన్ల వ్యూస్.. 

తాజాగా 'లెహరాయి లెహరాయి.. గుండె ఊహలెగిరాయి..' అనే లిరికల్ సాంగ్ వీడియోను విడుదల చేశారు.

Continues below advertisement

యంగ్ హీరో అక్కినేని అఖిల్, పూజాహెగ్డే జంటగా నటిస్తోన్న సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్'. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 15న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. దీంతో ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను షురూ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్, టీజర్లు, పాటలను విడుదల చేశారు. 

Continues below advertisement

Also Read: బాలయ్య షోలో ముందుగా మంచు ఫ్యామిలీ.. ఆ తరువాత మెగాఫ్యామిలీ..

తాజాగా 'లెహరాయి లెహరాయి.. గుండె ఊహలెగిరాయి..' అనే లిరికల్ సాంగ్ వీడియోను విడుదల చేశారు. ఇందులో అఖిల్-పూజా హెగ్దేల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు యూత్ ను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈ పాట ఇంటర్నెట్ ని షేర్ చేసింది. తాజాగా విడుదలైన వీడియో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గోపిసుందర్ సంగీతం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఇప్పటివరకు ఈ వీడియో సాంగ్ పది మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టింది. 

జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆమని, ఈషారెబ్బా, చిన్మయి కీలక పాత్రలలో నటిస్తున్నారు. మరి ఈ సినిమాతో అఖిల్ ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి!

Continues below advertisement