Coronavirus Cases Today: ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఆందోళన పెంచుతోన్న మరణాలు

ఏపీలో కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టినట్లే కనిపించినా.. మరోసారి పాజిటివ్ కేసులు, కోవిడ్19 మరణాలు భారీగా పెరిగాయి. నిన్న ఒక్కరోజులో 12 మంది కరోనాతో పోరాడుతూ మరణించారు.

Continues below advertisement

ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టినట్లే కనిపించినా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 32 వేల శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 503 మందికి పాజిటివ్ గా నిర్ధారించారు. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,55,170కు చేరుకుంది. కరోనా మరణాలు సైతం భారీగా పెరిగాయి. మొన్న కరోనాతో ఇద్దరే చనిపోగా.. నిన్న ఒక్కరోజులో 12 మంది కోవిడ్19తో మరణించారు. ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,268కు చేరుకుంది. 

Continues below advertisement

ఏపీలో నమోదైన మొత్తం 20,55,170 కరోనా పాజిటివ్ కేసులకు గాను, ఇప్పటివరకూ 20,33,970 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 7 వేలకు దిగొచ్చింది.  ప్రస్తుతం 6,932 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 2,88,00,809 (2 కోట్ల 88 లక్షల 809) శాంపిల్స్ కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... నిన్న ఒక్కరోజులో 32,846 శాంపిల్స్ పరీక్షించారు.

Also Read: కాఫీ, టీలు తాగే ముందు మంచి నీళ్లు తాగవచ్చా? తాగితే ఏమవుతుంది?

ఆదివారంతో పోల్చితే సోమవారం నాడు కరోనా కేసులు దాదాపు 70 శాతం పెరిగాయి. మొన్న 300 మంది కరోనా బారిన పడగా.. నిన్న ఒక్కరోజులో 500 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు. ఏపీలో కరోనా రికవరీ రేటు మెరుగ్గా ఉంది. గత రెండు నెలలుగా పాజిటివ్ కేసులతో పోల్చితే కోలుకున్న వారి సంఖ్య ప్రతిరోజూ అధికంగానే ఉంది.

Also Read: ఏసీల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? అయితే ఎంత నష్టమో తెలుసుకోండి

చిత్తూరులో అత్యధికం.. 
కోవిడ్19 బారిన పడి అత్యధికంగా చిత్తూరులో నలుగురు చనిపోగా.. కృష్ణాలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, గుంటూరు మరియు విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు కొవిడ్ మహమ్మారికి చికిత్స పొందుతూ మరణించారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో పేర్కొంది. చిత్తూరులో 108 మందికి కరోనా సోకగా.. కృష్ణాలో 88, గుంటూరులో 68, తూర్పు గోదావరిలో 42, విశాఖపట్నంలో 41 మంది కరోనా బారిన పడ్డారు.  

Also Read: షుగర్‌ ఉన్నవాళ్లు ఏం తినాలి? ఏం తినకూడదు? డైట్ తప్పనిసరిగా పాటించాలి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola