సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. కమర్షియల్ యాడ్స్ ను మాత్రం లైట్ తీసుకోరు. పలు బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ.. కోట్లలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. మహేష్ తో తమ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేసుకోవడానికి కార్పొరేట్ కంపెనీలు క్యూ కడుతుంటాయి. ఆయన ఒప్పుకుంటే అడిగినంత మొత్తాన్ని ఇస్తుంటారు. 


మొన్నటివరకు థమ్స్ అప్ బ్రాండ్ ను ప్రమోట్ చేసిన మహేష్ బాబు రీసెంట్ గా మౌంటెన్ డ్యూ బ్రాండ్ ను తన ఖాతాలో వేసుకున్నారు. దీనికి సంబంధించిన యాడ్ కూడా టెలికాస్ట్ అవుతుంది. ఇందులో బుర్జ్ ఖలీఫా లాంటి ఎత్తైన కట్టడం నుంచి బైక్ డ్రైవ్ చేసుకుంటూ కిందకు వచ్చే యాక్షన్ స్టంట్ లో మహేష్ బాబు కనిపించారు.


అయితే ఈ ఒక్క యాడ్ కోసం మహేష్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అక్షరాలా రూ.12 కోట్లు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇప్పటివరకు యాడ్స్ ద్వారా మహేష్ తీసుకున్న అత్యధిక రెమ్యునరేషన్ ఇదేనని చెబుతున్నారు. గతంలో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఓ యాడ్ కోసం రూ.10 కోట్ల పారితోషికం తీసుకున్నారు. ఇప్పుడు అదే రేంజ్ లో మహేష్ రెమ్యునరేషన్ అందుకోవడం విశేషం. 


ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మహేష్ 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నారు. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మే 12న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు.