తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి లాంటి తారలు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'కమిట్‌మెంట్'. ఈ సినిమా ఎప్పుడో రెండేళ్ల క్రితమే విడుదల కావాల్సింది. కానీ కరోనా, ఇతర కారణాల వలన విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్లు, పోస్టర్లు అప్పట్లో వివాదం సృష్టించాయి. దానికి తగ్గట్లే తేజస్వి మదివాడ ప్రెస్ మీట్స్ కొన్ని కాంట్రవర్శియల్ కామెంట్స్ చేసింది. 

 

ఏ ఇండస్ట్రీలోనైనా ఆడవాళ్లను కేవలం కోరికలు తీర్చే బొమ్మలుగా చూస్తున్నారని.. సినిమా ఇండస్ట్రీలో అలాంటి వ్యక్తులు చాలా ఎక్కువమంది ఉంటారని షాకింగ్స్ కామెంట్స్ చేసింది. ఇదే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ మొత్తం లిప్ లాక్స్, రొమాన్స్, బూతు డైలాగ్స్ తో నింపేశారు. అక్కడితో ఆగకుండా.. ట్రైలర్ చివర్లో 'మురికి చేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామము (కోరికల) చేత జ్ఞానము కప్పబడి యున్నది' అంటూ భగవద్గీతలో ప్రవచనం చెప్పారు. 

 

ఈ ప్రవచనం చెబుతున్నప్పుడు కొన్ని బోల్డ్ సన్నివేశాలను చూపించడంతో ఇప్పుడు ఇష్యూ అయింది. సోషల్ మీడియాలో నెటిజన్లు చిత్ర దర్శకనిర్మాతలు, నటీనటులను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. బూతు సన్నివేశాలకు భగవద్గీత ప్రవచనాలు యాడ్ చేస్తారా..? అంటూ మండిపడుతున్నారు. చిత్రబృందం కూడా కావాలనే ఎటెన్షన్ కోసం ఇలా చేసినట్లుంది. ఇప్పుడు ఈ వివాదం ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.