పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల 'ఆదిపురుష్' సినిమాను పూర్తి చేసిన ఆయన ఇప్పుడు 'సలార్', 'ప్రాజెక్ట్ K' సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. మధ్యలో 'సాహో', 'రాధేశ్యామ్' రూపంలో పెద్ద ప్లాప్స్ వచ్చినా.. ప్రభాస్ రేంజ్ మాత్రం తగ్గలేదు. ఆయన నటిస్తోన్న సినిమాల గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ప్రాజెక్ట్ K'లో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోంది.


 బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు అశ్వనీదత్. 


'ప్రాజెక్ట్ K' ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లబోతుందని.. ప్రభాస్, దీపికా సెట్స్ పైకి రావడానికి ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తవుతుందని.. 9 నెలలు గ్రాఫిక్స్ కోసం కేటాయించామని చెప్పుకొచ్చారు. హాలీవుడ్ అవెంజర్స్ రేంజ్ లో 'ప్రాజెక్ట్ K' ఉంటుందని చెప్పారు అశ్వనీదత్. ఈ సినిమాతో చైనా, అమెరికా మార్కెట్ ని టార్గెట్ చేస్తామని తెలిపారు. 


అక్టోబర్ 18, 2023న సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఒకవేళ ఆ తేదీకి విడుదల చేయలేని పక్షంలో 2024 సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Also Read: 'పుష్ప2'లో బుచ్చిబాబు ఇన్వాల్వ్మెంట్ - అంత లేదంటున్న దర్శకుడు!


Also Read: 'చంద్రముఖి' సీక్వెల్ లో ఐదుగురు హీరోయిన్లు - ఎవరెవరంటే?