సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉన్నారు. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందారు. ఆస్పత్రిలో ఉండటం వలన పునీత్ రాజ్ కుమార్ మరణించిన విషయం కూడా ఆయన రెండు రోజుల తర్వాత తెలిసింది. కోలుకుని, క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. తాజాగా ఆయన్ను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, రాజకీయ నాయకురాలు శశికళ కలిశారు. సూప‌ర్ స్టార్‌ను మర్యాద పూర్వకంగా పలకరించారు. రజనీకాంత్ ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. రజనీతో పాటు ఆయన భార్య లతాతో శశికళ భేటీ అయ్యారు.


ర‌జ‌నీకాంత్‌ను శశికళ కలవడంతో రాజకీయపరమైన విషయాలు ఏమైనా చర్చకు వచ్చాయా? అనే ఆలోచన ప్రజల్లో కలగడం సహజం. అయితే... ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి కలిశానని శశికళ చెప్పడం గమనార్హం. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు చాలా రోజులుగా కోరుతున్నారు. అయితే... తొలుత రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన ఆయన, అభిమానులతో సమావేశాలు కావడం, ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే.


సినిమాలకు వస్తే... శివ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన 'పెద్దన్న' సినిమా ఈ ఏడాది విడుదల అయ్యింది. ఆ సినిమా తర్వాత రజని ఏ సినిమా చేస్తారన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకునే అవకాశాలు ఎక్కువ అని చెన్నై సినీ వర్గాల టాక్.






Also Read: మరీ అంతలా తిట్టాలా? పద్ధతిగా చెప్పొచ్చుగా! - విడాకుల తర్వాత ట్రోల్స్‌పై సమంత స్పందన
Also Read: నెల రాజుని... ఇల రాణిని... కలిపింది కదా 'సిరివెన్నెల'! ఆయన చివరి సంతకం విన్నారా?
Also Read: డెసిషన్ మారలేదు... పుకార్లకు మరోసారి చెక్ పెట్టిన 'భీమ్లా నాయక్' ప్రొడ్యూసర్
Also Read: బాలకృష్ణ, బోయపాటి కాంబినేష‌న్‌లో డ‌బుల్ హ్యాట్రిక్‌కు సన్నాహాలు?
Also Read: యంగ్ హీరోకి టైటిల్ కష్టాలు.. రూ.2 కోట్లు డిమాండ్ చేస్తోన్న నిర్మాత..
Also Read: ఒక్కసినిమా కూడా కలిసి చేయలేదు, కేవలం ఆ ఒక్క మాటతో ప్రేమలో పడ్డారు... విక్కీ-కత్రినా లవ్ స్టోరీ
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి