వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకొనే హీరో సూర్య(Suriya) ఈ సారి వివాదాలు వెంటాడుతున్నాయి. ఫలితంగా ఆయన నటించిన ‘ఎదుర్కుం తునిందవన్’ (ET) చిత్రంతో చిక్కుల్లో పడింది. ఈ చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ PMK పార్టీ నేతలు, వన్నియార్ సంఘం సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో చెన్నైలోని సూర్య ఇంటి ముందు సాయుధ పోలీసులు పహారా కాస్తున్నారు. 


ఇటీవల ఆయన నిర్మించిన ‘జై భీమ్’ చిత్రంపై విమర్శలు నెలకొన్నాయి. అప్పటి నుంచి సూర్యకు ప్రభుత్వం ప్రత్యేక భద్రత కల్పిస్తోంది. ‘జై భీమ్’ చిత్రానికి విమర్శకుల నుంచి కూడా పాజిటివ్ రివ్యూ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ, తమిళనాడులో వన్నియర్ వర్గాల నేతలు మాత్రం ఆ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలు దెబ్బ తీశాయంటూ సూర్యపై నిప్పులు కక్కుతున్నారు. అందులోని చాలా సన్నివేశాల్లో తమ వర్గాన్ని అవమానించారంటూ మండిపడుతున్నారు. తమ వర్గాన్ని కించపరిచిన సూర్యాను కొడితే రూ.లక్ష నగదు బహుమానం ఇస్తామని కూడా ప్రకటించారు. తాజాగా సూర్య నటించిన ‘ET’ చిత్రాన్ని అడ్డుకుంటామని ప్రకటించారు. తమకు రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని సూర్యకు నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో ప్రభుత్వ సాయుధ బలగాలను సూర్య ఇంటి ముందు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. 


శింబు కేసులో నిర్మాతల సంఘానికి హైకోర్ట్ షాక్: శింబు హీరోగా నటించిన ‘అన్భానవన్ అడంగాదవన్ అసరాదవన్’ చిత్రం వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. 2016లో విడుదలైన ఈ చిత్రాన్ని మైఖేల్ రాయప్పన్ నిర్మించాడు. ఈ చిత్రంలో నటించేందుకు శింబూ నిర్మాతతో రూ.8 కోట్ల డీల్ కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ.1.51 కోట్లు తీసుకున్నాడు. అయితే, మిగతా రూ.6.49 కోట్లను నిర్మాత చెల్లించాలేదు. దీంతో శింబు తనకు రావల్సిన ఆ మొత్తాన్ని ఇప్పించాలని కోరుతూ నడిగర్ సంఘాన్ని ఆశ్రయించాడు. మరోవైపు నిర్మాత మైఖేల్ కూడా శింబుపై ఫిర్యాదు చేశాడు. శింబుతో నిర్మించిన ఆ చిత్రం వల్ల తాను తీవ్రంగా నష్టపోయానని, తనకు నష్టపరిహారం ఇప్పించాలని నిర్మాతల సంఘాన్ని కోరాడు. మీడియా ముందు కూడా ఈ విషయాన్ని వెల్లడించాడు. 


Also Read: సమంతను ఆ మధుర జ్ఞాపకం వెంటాడుతోందా? చివరికి అది కూడా చైతూకు తిరిగిచ్చేసిన సామ్!


ఈ నేపథ్యంలో శింబు నిర్మాతపై రూ.కోటి పరువు నష్టం దావా వేశాడు. ఇందులో నిర్మాతల సంఘంతోపాటు అప్పటి నడిగర్ సంఘం సెక్రటరీ విశాల్‌ను కూడా ప్రతివాదులుగా చేర్చాడు. ఈ కేసును విచారించిన చెన్నై హైకోర్టు తమిళ సినీ నిర్మాతల సంఘానికి రూ.లక్ష జరిమానా విధించింది. అయితే, ఇది శింబు పరువు నష్టంపై కాదు, ఈ కేసు పెట్టి సుమారు ఆరేళ్లు కావస్తున్నా నిర్మాత సంఘం లిఖిత పూర్వక వివరణ ఇవ్వకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఈ ఆదేశాలు ఇచ్చింది. కేసును ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. 


Also Read: ఆ ప్రేమకథ ఎప్పటికీ ఎండ్ అవ్వకూడదని కోరుకుంటున్న సమంత