మిళ టాప్ హీరో సూర్య గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులో విడుదలవుతూనే ఉన్నాయి. డబ్బింగ్ సినిమాలు అయినా మంచి ప్రజాదరణ కొనసాగుతోంది. తెలుగులో సూర్యకు మంచి మార్కెట్ ఉంది. ‘గజిని’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సూర్య, తాజాగా కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాతోనూ తెలుగు ఆడియెన్స్ ను పలకరించారు. ప్రముఖ తమిళ దర్శకుడు బాలాతో కలిసి ’వనంగాన్’ అనే సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. ఏం జరిగిందో తెలియదు కానీ, తాజాగా ఈ సినిమా నుంచి తప్పకున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు బాలా ధృవీకరించారు.


సూర్య తప్పుకోవడానికి కారణం ఇదేనా?


సూర్య ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి చాలా కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా అనుకున్న కథ కాకుండా చాలా మార్పులు చేశారట దర్శకుడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య మనస్పర్దలు వచ్చాయట. చివరకు ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా దర్శకుడు బాలా ఈ విషయానికి సంబంధించి ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. “కథలో కొన్ని మార్పులు చేర్పులు చేశాను. దీంతో ఈ సినిమా సూర్యకు సరిపోదని భావించాను. మరో హీరోతో ఈ సినిమా రాబోతోంది.  సూర్యతో నాకు ఎలాంటి విబేధాలు లేవు. త్వరలో మంచి కథతో ఆయనతో కలిసి పని చేస్తాను” అని బాలా తెలిపారు.


రెండు సినిమాల్లో కలిసిన పని చేసిన సూర్య, బాలా


సూర్య, బాలా కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి.  2001లో ‘నంద’,  2003లో ‘పితామగన్’ సినిమాలు విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. సుమారు రెండు దశాబ్దాల తర్వాత  ’వనంగాన్’ అనే సినిమా చేయాలనుకున్నారు. కానీ, సూర్య ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఈ సినిమాలో సూర్య స్థానంలో ఏ హీరో వస్తారు? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.    


ఇక సూర్య తాజాగా ‘సూరరై పొట్రు’ ( తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’) సినిమాలో నటనకు గాను  ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం  ఆయన రెండు తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. ఒకటి శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. మరో సినిమా కటి వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడివాసల్’ అనే పేరుతో రూపొందుతోంది.  ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్ జరుగుతోంది. సూర్య తాజాగా ఈటీ(ET) అనే సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు.  పాండి రాజ్ తెరెక్కించిన ఈ సినిమా ఆడియెన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఓటీటీ వేదికగా విడుదలైన ‘జై భీమ్’ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది.


Read Also: సంక్రాంతి బరిలో అజిత్‌ ‘తునివు’ - తెలుగులోనూ రిలీజ్, ఈసారైనా ఆ కష్టాలు తీరేనా?