షూటింగ్ సమయంలో ఒక సన్నివేశాన్ని దర్శకుడికి నచ్చేవరకు చిత్రీకరిస్తూనే ఉంటారు. యాక్షన్ కానీ, రొమాన్స్ కానీ ఏదైనా కావొచ్చు.. ఆ సన్నివేశాలు పెర్ఫెక్ట్ గా వస్తేనే నెక్స్ట్ షాట్ కి వెళ్తారు. అనుభవం ఉన్న తారలు ఈజీగా నటించేస్తారు కానీ కొత్తవాళ్లు కాస్త ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి కష్టపడుతుంటారు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూతురు సుప్రీత విషయంలో కూడా అదే జరిగిందట.
ఓ సీన్ కోసం తనతో పదే పదే ముద్దులు పెట్టించుకున్నారని సుప్రీత వెల్లడించింది. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందుకే ఇప్పటివరకు ఒక్క సినిమాలో నటించకపోయినా.. మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది. తన తల్లితో కలిసి చేసిన డాన్స్ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి.
రీసెంట్ గా ఈమె ఓ మ్యూజికల్ వీడియోలో నటించింది. ఇద్దరు ప్రేమికుల మధ్య ఎమోషన్స్ ను ఓ పాట రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు. 'వెళ్ళిపో' అనే పేరుతో ఈ ఆల్బమ్ ని చిత్రీకరించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఇందులో సుప్రీత బాయ్ ఫ్రెండ్ గా ర్యాప్ సింగర్ రాకీ జోర్దాన్ నటించారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుప్రీత ఈ సాంగ్ కి సంబంధించిన షూటింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంది.
ఈ సాంగ్ లో ముద్దు సన్నివేశాలు చాలా కష్టంగా అనిపించాయని చెప్పింది. కిస్ సీన్స్ షూటింగ్ సమయంలో మళ్లీ మళ్లీ తనతో ముద్దులు పెట్టించుకున్నారని.. రెండు రోజుల పాటు ఆ సీన్ షూటింగ్ చేశారని చెప్పుకొచ్చింది. తన లైఫ్ లో ఈ హగ్గులు, కిస్సులు లేవని అందుకే చాలా ఇబ్బందిగా అనిపించిందని సుప్రీత చెప్పుకొచ్చింది.