సౌత్ ఇండియన్ స్టార్ హీరో రజనీకాంత్ కు ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువ. ఆయన ప్రతి ఏటా హిమాలయాలను సందర్శిస్తుంటారు. సాధారణ వ్యక్తిలా అందరితో పాటు సింపుల్ గా నడుచుకుంటూ వెళ్తారు. అక్కడి ధ్యాన కేంద్రాలను, ఆలయాలను సందర్శిస్తుంటారు. అలాగే రీసెంట్ గా ‘జైలర్’ సినిమా విడుదలకు ముందు కూడా ఆయన ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లారు. హిమాలయాలకు వెళ్లి అక్కడ కొద్ది రోజుల పాటు ధ్యానం చేశారు. బద్రీనాథ్ క్షేత్రాన్నిసందర్శించుకున్నారు. అక్కడి నుంచి ఉత్తరాఖండ్ అల్మోరాకు వెళ్లారు. అక్కడున్న మహావతార్ బాబా గుహను సందర్శించుకున్నారు.  దాదాపు అరగంటపాటు ధ్యానం చేశారు. అక్కడి ఆశ్రమంలోని సాధువులతో సంభాషించారు.  


ఎంతో కష్టపడి బాబా గుహలను సందర్శించిన రజనీకాంత్


అయితే,  ఉత్తరాఖండ్ లోని బాబా గుహలను దర్శించుకునేందుకు ఆయన ఎంత కష్టపడ్డారో తెలుస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. వెంట వచ్చిన ఇద్దరు ముగ్గురు పోలీసులు, ఒకరిద్దరు ఆయన అసిస్టెంట్లు కలిసి చేతిలో కర్ర పట్టుకుని 72 ఏండ్ల వ్యక్తి, యువకుడిలా పర్వతాలను దాటుకుంటూ వెళ్లారు. ఒకటి రెండు చోట్ల పోలీసులు ఆయనకు సాయం చేశారు. మధ్య మధ్యలో ఆగుతూ అభిమానులకు సెల్ఫీలు ఇచ్చారు. ఎంతో కష్టమైన దారిలో నడుచుకుంటూ ద్వారహత్ నుంచి మహావతార్ బాబా గుహకు చేరుకున్నారు. అక్కడ కొంత సమయం పాటు గడిపారు. ఆధ్యాత్మిక విషయాల గురించి అక్కడి సన్యాసులతో మాట్లాడారు. ప్రతి ఏడు మాదిరిగానే ఈ ఏడాది కూడా బాబా ఆశ్రమ సందర్శన ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి కావడం పట్ల రజనీ సంతోషం వ్యక్తం చేశారు. రజనీకాంత్ బాబా గుహ సందర్శనకు సంబంధించిన వీడియోను ‘Divine tushar worldwide’లో యూట్యూబర్ అప్ లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోకు బాగా వైరల్ అవుతోంది. మిలియన్ కు పైగా వ్యూస్ వచ్చాయి.   



కెరీర్ లోనే బిగ్గెసట్ హిట్ గా నిలిచిన ‘జైలర్’


ఇక రజనీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇండియాలోని టాప్ యాక్టర్లలో ఆయన ఒకరుగా కొనసాగుతున్నారు. ఏడు పదువల వయసులోనూ కుర్ర హీరోలకు దీటుగా ఆయన స్టైలిష్ పర్ఫామెన్స్ తో అదరగొడతారు. అందుకే ఆయనంటే ఇప్పటికీ ప్రేక్షకులలో ఎంతో క్రేజ్ ఉంది. తాజాగా విడుదలూన ‘జైలర్’ మూవీ ఆయన కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 650 కోట్లుకు పైగా వసూళ్లను సాధించింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ‘జైలర్’ చిత్రాన్ని తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇందులో తమన్నా, జాకీష్రాఫ్‌, మోహన్‌ లాల్‌, శివరాజ్‌ కుమార్‌, సునీల్‌, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మరో కీలక పాత్రలో నటించింది. చాలా కాలం తర్వాత రజనీకాంత్ సినిమాలో రమ్యకృష్ణ నటించడం బాగా కలిసి వచ్చింది.  అనిరుధ్ సంగీతం అందరినీ ఆకట్టుకుంది.  


Read Also: హీరోగా పరిచయం అవుతున్న పరుచూరి బ్రదర్స్ మనవడు - జీవితాన్ని నాశనం చేసే పుకార్లు ఏమిటి?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial