ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప ది రైజ్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇంటర్నేషనల్ రేంజ్ లో ఈ సినిమాకి రీచ్ దక్కింది. సినిమాలో బన్నీ మేనరిజమ్స్ ని ఇమిటేట్ చేస్తూ కొన్ని లక్షల రీల్స్ వచ్చాయి. క్రికెట్ మ్యాచ్ లలో, కిక్ బాక్సింగ్ లో 'తగ్గేదేలే' అంటూ రచ్చ చేశారు సెలబ్రిటీలు. 'పుష్ప' ఇంత పెద్ద హిట్ అవుతుందని మేకర్స్ కూడా ఊహించి ఉండరు. ఆ రేంజ్ లో సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా 'పుష్ప ది రూల్' రాబోతుంది. 


సోమవారం (ఆగస్టు 22) పూజా కార్యక్రమాలతో అధికారికంగా సుకుమార్ షూటింగ్ మొదలుపెట్టారు. ఈ పూజా కార్యక్రమంలో డైరెక్టర్ సుకుమార్, ప్రొడ్యూసర్స్ నవీన్, రవి శంకర్ పాల్గొన్నారు. అల్లు అర్జున్ అమెరికా పర్యటనలో ఉండడం వలన ఈ వేడుకలో పాల్గొనలేకపోయారు. మిగిలిన నటీనటులు ఎవరూ కూడా దీనికి హాజరు కాలేదు. తరువాత సరైన ముహుర్తాలు లేకపోవడంతో హీరో లేకుండానే సింపుల్ గా ముహూర్త వేడుక పూర్తి చేశారు. 


పూజా కార్యక్రమం సందర్భంగా 'పుష్ప2'కి సంబంధించి కీలక మార్పు గురించి సమాచారం బయటకి వచ్చింది. 'పుష్ప1'లో నిర్మాణ భాగస్వామిగా ఉన్న మొత్తంశెట్టి మీడియా సంస్థ.. సీక్వెల్ కి దూరమైంది. దాని స్థానాల్లో సుకుమార్ సొంత నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ వచ్చింది. అల్లు అర్జున్ తల్లి తరఫు బంధువులదే ముత్తంశెట్టి మీడియా సంస్థ. వారికి బన్నీ తరఫున ఒక అవకాశం ఇవ్వడం కోసం 'పుష్ప' సినిమాలో భాగస్వామిగా చేశారు. లాభాల్లో వాటా ఇచ్చారు. అక్కడితో ఆ సంస్థ కథ ముగిసింది. 


ఈ సినిమా పెద్ద సక్సెస్ కావడంతో సీక్వెల్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీన్ని క్యాష్ చేసుకోవాలనుకున్నారు సుకుమార్. మొదటి నుంచి మైత్రి మూవీ మేకర్స్ లో తాను చేసే సినిమాల్లో రెమ్యునరేషన్ తో పాటు కొంతవరకు లాభాల్లో వాటా తీసుకుంటున్నారు సుకుమార్. అయితే 'పుష్ప2' సినిమా భారీ వసూళ్లు రాబడుతుందనే అంచనా ఉండడంతో సుకుమార్ ఇందులో నిర్మాణ భాగస్వామిగానూ చేరినట్లు తెలుస్తోంది. మొత్తానికి సుకుమార్ పెద్ద ప్లానే వేశారని చెప్పారు. అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది.


 'పుష్ప' సినిమాకి క్రేజీ డీల్:


'పుష్ప' పార్ట్ 2 ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే శాటిలైట్, డిజిటల్ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నాయి కొన్ని సంస్థలు. 'పుష్ప'తో డీల్ క్లోజ్ చేయాలని చూస్తున్నాయి. రీసెంట్ గా ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం రూ.100 కోట్ల ఆఫర్ చేసిందట ఓ సంస్థ. మైత్రి మూవీస్ బ్యానర్ ఈ డీల్ పై ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. బన్నీ మాత్రం వద్దని చెప్పారట. సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత బిజినెస్ ఇంకా బాగా జరుగుతుందని.. కాబట్టి అప్పటివరకు ఎలాంటి డీల్స్ ఓకే చేయొద్దని చెప్పారట. దీంతో ప్రస్తుతానికి ఈ క్రేజీ డీల్ ను పక్కన పెట్టేశారు. 'పుష్ప' పార్ట్ 1 సమయంలో మాత్రం డిజిటల్ అండ్ శాటిలైట్ హక్కులను ముందే అమ్మేశారు. ఈసారి మాత్రం అలా చేయడం లేదు.  


సుకుమార్ కి బన్నీ డెడ్ లైన్:


దర్శకుడు సుకుమార్ కి ఈ సినిమా విషయంలో బన్నీ డెడ్ లైన్ విధించినట్లు తెలుస్తోంది. వందరోజుల్లో షూటింగ్ ను పూర్తి చేయాలని చెప్పాడట బన్నీ. 2022 దసరా నాటికి 'పుష్ప' పార్ట్ 2ని విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టాలని చూస్తున్నారు. నిజానికి పార్ట్ 1 సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం దొరకలేదు. దీంతో ఆ ఎఫెక్ట్ సీజీ వర్క్ పై పడింది. సినిమాలో గ్రాఫిక్స్ సరిగ్గా లేదనే విమర్శలు వచ్చాయి. ఈసారి అలాంటి కామెంట్స్ కి తావివ్వకుండా త్వరగా షూటింగ్ పూర్తి చేసి.. గ్రాఫిక్స్ అండ్ మిగిలిన వర్క్ పై ఎక్కువ ఫోకస్ చేయాలని చూస్తున్నారు. 


Also Read : రాజశేఖర్ - పవన్ సినిమా మొదలు


Also Read : ఎవరు ఆపుతారో చూద్దాం - విజయ్ దేవరకొండ