Sudigali Sudheer Rashmi Propose : 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో సుడిగాలి సుధీర్ - మళ్ళీ రష్మీకి ప్రపోజ్‌తో రచ్చ రచ్చ !

'ఎక్స్ట్రా జబర్దస్త్' స్టేజి మీద 'సుడిగాలి' సుధీర్ మళ్ళీ సందడి చేశారు. అయితే... దీని వెనుక కథ వేరే ఉంది. ఆయన కామెడీ ఒక్క ఎపిసోడ్‌కు మాత్రమే పరిమితం కానుంది. మళ్ళీ స్కిట్స్ చేయాలంటే....

Continues below advertisement

'సుడిగాలి' సుధీర్ (Sudigali Sudheer) పేరు చెబితే తెలుగు బుల్లితెర వీక్షకులకు, ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది 'ఎక్స్ట్రా జబర్దస్త్' (Extra Jabardasth). డబ్బుల కోసం ఆ కార్యక్రమానికి బ్రేక్ ఇచ్చి, వేరే ఛానల్‌కు వెళ్ళిన ఆయన... మళ్ళీ 'ఎక్స్ట్రా జబర్దస్త్' స్టేజి మీద సందడి చేశారు. రష్మీ గౌతమ్ (Rashmi Gautam) కు స్టేజి మీద ప్రపోజ్ చేశారు. రచ్చ రచ్చ చేశారు. అయితే... దీని వెనుక కథ వేరే ఉంది. 

Continues below advertisement

'గాలోడు' కోసం 'ఎక్స్ట్రా జబర్దస్త్'కు...
సుధీర్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'గాలోడు' (Gaalodu Movie). ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల అవుతోంది. ఆ సినిమా ప్రచారం కోసం సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, దర్శకుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్లతో కలిసి సందడి చేశారు. 'ఎక్స్ట్రా జబర్దస్త్'కు సుధీర్ వచ్చింది సినిమా ప్రమోషన్ కోసమే అయినప్పటికీ...  రెండు స్కిట్స్ కూడా చేశారు.
 

ఒక స్కిట్‌లో రష్మీకి ఆయన ప్రపోజ్ చేశారు. వాళ్ళిద్దరి ట్రేడ్ మార్క్ డైలాగ్ ఉంది కదా! 'నేను చచ్చపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు గానీ... నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా' అని రష్మీతో సుధీర్ చెప్పారు. 'చావరా... చావు' అని రష్మీ అనడంతో సుధీర్ షాక్ అయ్యారు. గెస్ట్ ఎంట్రీ ఓకే గానీ... మళ్ళీ సుధీర్ రీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో అని టీవీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆయన మళ్ళీ స్కిట్స్ చేయాలంటే మల్లెమాల సంస్థ ఓకే అనాల్సిందేనని టాక్.

Also Read : 'యశోద' రివ్యూ : అసలు కథ వేరే బాస్ - సమంత షీరోయిజం ఎలా ఉందంటే?
 
డబ్బుల కోసమే 'జబర్దస్త్'కు బ్రేక్!
'జబర్దస్త్'ను 'సుడిగాలి' సుధీర్ ఎందుకు వీడాల్సి వచ్చింది? ఎందుకు వేరే ఛానళ్ళలో షోస్ చేశారు? అంటే... ఫైనాన్షియల్ స్ట్రెస్ కారణమని ఆయన చెప్పారు. 

''నేను 'జబర్దస్త్'కు చిన్న బ్రేక్ ఇచ్చానంతే! అది కూడా మల్లెమాల యాజమాన్యానికి చెప్పి బ్రేక్ తీసుకున్నాను. నాకు ఉన్న ఫైనాన్షియల్ స్ట్రెస్ వల్ల! నాకు ఉన్న ఆర్థిక ఒత్తిడి గురించి మల్లెమాలకు చెప్పాను. వాళ్ళు ఏమైనా అడ్జస్ట్ చేస్తారేమోనని అడిగా. అయితే... అప్పుడు వాళ్ళు స్టూడియో కట్టడంతో కుదరలేదేమో!? ఆరు నెలలు గ్యాప్ తీసుకోవడానికి ఓకే అన్నారు. ఆరు నెలలు అయిపొయింది. మళ్ళీ మల్లెమాల సంస్థకు 'నేను వర్క్ చేయడానికి రెడీ' అని చెప్పాను. ఇంకేమైనా షోస్ ఉంటే చెప్పమని అడిగాను. ప్రస్తుతం మాట్లాడుతున్నాం'' అని 'సుడిగాలి' సుధీర్ వివరించారు. తాను ఈ విషయం గురించి మాట్లాడకపోడంతో జనాలు ఏదేదో అనుకున్నారని ఆయన పేర్కొన్నారు. అదీ సంగతి!

బుల్లితెరపై హాస్య నటుడిగా ప్రయాణం ప్రారంభించి వెండితెరపై కథానాయకుడి వరకు 'సుడిగాలి' సుధీర్ వచ్చారంటే... కారణం 'ఎక్స్ట్రా జబర్దస్త్', 'జబర్దస్త్' ప్రోగ్రామ్సే. మల్లెమాల సంస్థ రూపొందించిన 'పోరా పోవే', డాన్స్ రియాలిటీ షో 'ఢీ', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కార్యక్రమాలు ఆయన్ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి.

'సుడిగాలి' సుధీర్‌తో పాటు 'గెటప్' శీను కూడా 'ఎక్స్ట్రా జబర్దస్త్' వీడినా... మళ్ళీ కొన్ని రోజులకు ఆయన తిరిగి వచ్చారు. అందువల్ల, సుధీర్ కూడా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలను కొట్టి పారేయలేం. అదీ సంగతి!

Continues below advertisement