నైట్రో స్టార్ సుధీర్ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా నటించిన సినిమా 'హంట్' (Hunt Movie). భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రమిది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. కొత్త ఏడాదిలో కొత్త నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 


జనవరి 26న 'హంట్' విడుదల
రిపబ్లిక్ డే కానుకగా 'హంట్' సినిమాను విడుదల చేయనున్నట్లు ఈ రోజు భవ్య క్రియేషన్స్ సంస్థ ప్రకటించింది. ఆల్రెడీ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేశామని తెలియజేసింది.


'హంట్' విడుదల తేదీని వెల్లడిస్తూ... కొత్త పోస్టర్ విడుదల చేశారు. సుధీర్ లుక్ & కళ్ళలో ఇంటెన్సిటీ ప్రేక్షకులను అట్ట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. ఆయన ముందు మంకీ క్యాప్ ధరించిన వ్యక్తి ఒకరు కింద పడి ఉన్నారు. బహుశా... దొంగలను సుధీర్ వేటాడే సన్నివేశం అయ్యి ఉంటుంది. సుధీర్ బాబుతో పాటు శ్రీకాంత్, 'ప్రేమిస్తే' భరత్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్లుగా కనిపించనున్నారు.  


చిత్ర నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ "మా చిత్రాన్ని జనవరి 26న థియేటర్లలో విడుదల చేస్తున్నాం. రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకులు అందరినీ సినిమా అలరిస్తుంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన పలు చిత్రాలకు వర్క్ చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ 'హంట్'లో స్టంట్స్ కంపోజ్ చేశారు. 'జాన్ విక్ 4'కి కూడా వాళ్ళే స్టంట్ కొరియోగ్రాఫర్స్. వాళ్ళు యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాకి హైలైట్ అవుతుంది. ఆల్రెడీ విడుదలైన టీజర్, 'పాపతో పైలం...' పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యాయి. త్వరలో ట్రైలర్ విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని అన్నారు. 


Also Read : చేసుకుంటా, రాసి పెట్టిలేదు, క్లారిటీ లేదు - పెళ్ళిపై కన్‌ఫ్యూజ్‌ చేసిన ప్రభాస్  






'హంట్' సినిమాలో సుధీర్ బాబు, శ్రీకాంత్, 'ప్రేమిస్తే' భరత్ పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేస్తున్నారు. టీజర్ చూస్తే... సుధీర్ బాబు తన గతం మర్చిపోయాడని తెలుస్తుంది. గతం మరువక ముందు అతడు స్టార్ట్ చేసిన కేస్ ఏమిటి? దాన్ని మళ్ళీ అతడే క్లోజ్ చేయాలని శ్రీకాంత్ ఎందుకు చెబుతున్నారు? అనేది ఆసక్తిగా మారింది. అంతర్జాతీయ తీవ్రవాదాన్ని స్పృశిస్తూ... పోలీస్ నేపథ్యంలో తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రమిదని దర్శకుడు మహేష్ తెలిపారు. ట్రైలర్ వస్తే కథ గురించి మరింత తెలిసే అవకాశం ఉంది. 


'మైమ్' గోపి, కబీర్ దుహాన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ, మహేష్ సోదరి మంజుల ఘట్టమనేని, చిత్రా శుక్లా, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ, 'జెమినీ' సురేష్, అభిజీత్ పూండ్ల, కోటేష్ మన్నవ, సత్య కృష్ణన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కళా దర్శకత్వం : వివేక్ అన్నామలై, కాస్ట్యూమ్ డిజైనర్ : రాగ రెడ్డి, యాక్షన్ : రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ (హాలీవుడ్) , స్టంట్స్ : వింగ్ చున్ అంజి, కూర్పు : ప్రవీణ్ పూడి, ఛాయాగ్రహణం : అరుల్ విన్సెంట్‌, సంగీతం : జిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి, నిర్మాత : వి. ఆనంద ప్రసాద్, దర్శకత్వం : మహేష్.  




Also Read : 'లక్కీ లక్ష్మణ్' రివ్యూ : 'బిగ్ బాస్' సోహైల్ సినిమా ఎలా ఉందంటే?