నిట్రో స్టార్ సుధీర్ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా 'హంట్' (Hunte Telugu Movie). ఇందులో ఆయన పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. ఆయనతో పాటు శ్రీకాంత్, తమిళ హీరో భరత్ కూడా పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేస్తున్నారు. ఈ రోజు ముగ్గురి క్యారెక్టర్ పోస్టర్లు విడుదల చేశారు.


'హంట్' సినిమాలో హీరో సుధీర్ బాబు క్యారెక్టర్ పేరు అర్జున్ ప్రసాద్. ఒక చేతిలో సిగరెట్, మరో చేతికి బ్రాండెడ్ స్మార్ట్ వాచ్, ఒంటిపై స్టైలిష్ కోట్, అన్నిటికీ మించి కళ్లలో ఇంటెన్స్ లుక్... సుధీర్ బాబు న్యూ స్టిల్ బావుంది. ఈ సినిమాలో మోహన్ భార్గవ్ పాత్రలో శ్రీకాంత్, దేవ్‌గా 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
  
సెప్టెంబర్ 28న టీజర్!
'హంట్' సినిమాకు 'గన్స్ డోంట్ లై' (తుపాకులు అబద్దాలు చెప్పవు) అనేది క్యాప్షన్. పోలీసుగా సుధీర్ బాబు ఎవరి కోసం వేట మొదలు పెట్టారు? ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ నెల 28న 'హంట్' టీజర్ విడుదల చేయనున్నట్లు నేడు తెలిపారు.


సినిమా గురించి వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ "ఇదొక యాక్షన్ థ్రిల్లర్. చాలా స్టైలిష్‌గా ఉంటుంది. టీజర్ చూస్తే సినిమా ఏ విధంగా ఉంటుందో ఒక ఐడియా వస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన సుధీర్ బాబు చిత్రాలకు పూర్తి భిన్నమైన చిత్రమిది.సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్... సినిమాలో ఈ ముగ్గురూ స్నేహితులుగా కనిపిస్తారు. కనిపించని శత్రువును పట్టుకోవడం కోసం ఎటువంటి వేట సాగించారన్నది చిత్రకథ. యాక్షన్ సీక్వెన్సులు నేచురాలిటీకి దగ్గరగా ఉంటాయి'' అని చెప్పారు.


Also Read : 'ఆదిపురుష్' ట్రెండ్ సెట్టర్ - నేను ప్రభాస్ వీరాభిమాని : సోనాల్ చౌహన్ ఇంటర్వ్యూ






భరత్‌కు స్ట్రెయిట్ తెలుగు చిత్రమిది!
'ప్రేమిస్తే' ఫేమ్ భరత్‌కు స్ట్రెయిట్ తెలుగు చిత్రమిది. ఇంతకు ముందు మహేష్ బాబు 'స్పైడర్'లో ఆయన నటించారు. అయితే, అది బైలింగ్వల్. 'హంట్'తో తెలుగు తెరకు ఆయన పరిచయం అవుతున్నారు. ఈ సినిమా కథ విన్న వెంటనే చాలా ఎగ్జైట్ అయ్యారని, వెంటనే ఓకే చెప్పేశారని తెలిసింది. 


సుధీర్ బాబు, శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ పోలీస్ అధికారులుగా నటిస్తున్న ఈ సినిమాలో 'మైమ్' గోపి, 'జిల్' ఫేమ్ కబీర్ దుహాన్ సింగ్, మౌనిక రెడ్డి, 'మిడిల్ క్లాస్ మెలోడీస్' ఫేమ్ గోపరాజు రమణ, మంజుల, చిత్రా శుక్ల, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ, 'జెమినీ' సురేష్, అభిజీత్ పూండ్ల, సత్య కృష్ణన్ తదితరులు  ఇతర తారాగణం. 


ఈ చిత్రానికి కళ : వివేక్ అన్నామలై, యాక్షన్ : రేనౌడ్ ఫవేరో (యూరప్), స్టంట్స్ : వింగ్ చున్ అంజి, కూర్పు : ప్రవీణ్ పూడి, ఛాయాగ్రహణం : అరుల్ విన్సెంట్‌, సంగీతం : జిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి, నిర్మాత : వి. ఆనంద ప్రసాద్, దర్శకత్వం : మహేష్.    


Also Read : చిరంజీవితో వస్తున్నాం కానీ ఆయనకు పోటీగా కాదు