నిట్రో స్టార్ సుధీర్ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా రూపొందుతోన్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'హంట్' (Hunt Movie). ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో అప్సరా రాణి (Apsara Rani) స్పెషల్ సాంగ్ చేశారు. 


'హంట్'లో పాపతో పైలం...
పటాకా సాంగ్ ఆఫ్ ది ఇయర్!
Hunt Movie Song Update : 'హంట్' సినిమాలో సుధీర్ బాబు, అప్సరా రాణిపై తెరకెక్కించిన 'పాపతో పైలం...' పాట (Papa Tho Pailam Song) ను ఈ నెల 11న ఉదయం 10.04 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఈ రోజు వెల్లడించింది. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించారు.
 





అప్సరా రాణి స్పెషల్ సాంగ్ చేస్తే హిట్టే!
అప్సరా రాణి కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేశారు. తెలుగులో రెండు మూడు చిత్రాలు చేశారు. ఆ సినిమాల కంటే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నటించిన 'డేంజరస్', ఫోటో షూట్స్, స్పెషల్ సాంగ్స్ పేరు తీసుకొచ్చారు. పాపులారిటీ పెంచాయి. గత ఏడాది మాస్ మహారాజా రవితేజ 'క్రాక్' సినిమాలో 'భూమ్ బద్దలు...' సాంగ్ చేశారు. ఆ తర్వాత మ్యాచో స్టార్ గోపీచంద్ 'సీటీమార్' సినిమాలో 'పెప్సీ ఆంటీ...'లో సందడి చేశారు. ఆ రెండూ హిట్ అయ్యాయి. వర్మ 'డి కంపెనీ'లో కూడా స్పెషల్ సాంగ్ చేశారు. ఆ మూడు సాంగ్స్ తర్వాత ఇప్పుడు 'హంట్'లో సాంగ్ చేశారు. 






సుధీర్ బాబులో ఇద్దరు!
Hunt Movie Teaser : 'హంట్'లో అర్జున్ ప్రసాద్ పాత్రలో సుధీర్ బాబు నటిస్తున్నారని, ఆయనది పోలీస్ ఆఫీసర్ రోల్ అనేది తెలిసిందే. సిక్స్ ప్యాక్ బాడీ, స్టైలిష్ యాటిట్యూడ్, ఎక్స్‌ట్రాడిన‌రీ ఫైటింగ్ స్కిల్స్, ఎంతటి ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ ముందడుగు వేసే ధైర్య సాహసాలు... అర్జున్ అంటే ఐకానిక్ పోలీస్ అన్నట్లు 'హంట్' టీజర్‌లో సుధీర్ బాబును చూపించారు. అసలు ట్విస్ట్ (Sudheer Babu's Hunt Movie Twist) ఏంటంటే... అర్జున్‌లో ఇద్దరు ఉన్నారు! ఒకరు అర్జున్ 'ఎ', మరొకరు అర్జున్ 'బి'. 



అర్జున్ 'ఎ'కి తెలిసిన మనుషులు, సంఘటనలు, వ్యక్తిగత జీవితం ఏదీ అర్జున్ 'బి'కి తెలియదు. ఇద్దరూ వేర్వేరు మనుషులు అన్నట్టు! అయితే... అర్జున్ 'ఎ'కి తెలిసిన భాషలు, నైపుణ్యాలు, పోలీస్ శిక్షణ అర్జున్ 'బి'లో ఉన్నాయి. సూటిగా, చాలా స్పష్టంగా చెప్పాలంటే... వ్యక్తిగత జీవితంలో అర్జున్ గజినీ. పోలీస్ డ్యూటీకి వచ్చేసరికి గజినీ కాదు. అయితే... అర్జున్ 'ఎ'గా ఉండటమే హీరోకి ఇష్టం. మరి, అతని కోరిక నెరవేరిందో? లేదో? సినిమాలో చూడాలి. ''ఏ కేసును అయితే అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయాడో... అదే కేసును ఇప్పుడు ఈ అర్జున్ సాల్వ్ చేయాలి'' అని శ్రీకాంత్ చెప్పే డైలాగ్ గానీ, ''తను ఎలా చనిపోయాడో తెలుసుకునే ప్రాసెస్‌లో ఎవరు ఎఫెక్ట్ అయినా... ఎంత ఎఫెక్ట్ అయినా... నన్ను ఎవరూ ఆపలేరు'' అని సుధీర్ బాబు చెప్పే డైలాగ్ గానీ సినిమాపై మరింత ఆసక్తి పెంచాయి. 


Also Read : ముగిసిన ఇందిరా దేవి పెద్ద కర్మ - నివాళులు అర్పించిన మహేష్ & ఫ్యామిలీ


అర్జున్ స్టార్ట్ చేసిన కేస్ ఏమిటి? చనిపోయింది ఎవరు? అనే విషయాలను టీజర్‌లో రివీల్ చేయలేదు. సినిమాకు అదే కీలక అంశంగా తెలుస్తోంది. ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచింది. అంతర్జాతీయ తీవ్రవాదాన్ని స్పృశిస్తూ... పోలీస్ నేపథ్యంలో తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రమిదని దర్శకుడు మహేష్ తెలిపారు. కొన్ని యాక్షన్ సీక్వెన్సులను ఫ్రాన్స్‌లో అక్కడి స్టంట్ డైరెక్టర్స్‌తో తీశామని ఆయన పేర్కొన్నారు.    


Also Read : Exposed Web Series Review - ఎక్స్‌పోజ్డ్‌ వెబ్ సిరీస్ రివ్యూ : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పించు... న్యూస్ ప్రజెంటర్ డెత్ మిస్టరీ