సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తల్లి, కృష్ణ ఘట్టమనేని భార్య ఇందిరా దేవి (Indira Devi) సెప్టెంబర్ 28న తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆమె మృతితో ఘట్టమనేని కుటుంబం శోక సంద్రంలో మునిగింది. అభిమానులు కూడా వాళ్ళకు వచ్చిన కష్టం చూసి ప్రేక్షకులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు.
 
ముగిసిన ఇందిరమ్మ పెద్ద కర్మ
ఇందిరా దేవి మరణించి నేటికి పదకొండు రోజులు. హైదరాబాద్‌లో ఈ రోజు పెద్ద కర్మ నిర్వహించారు. అందులో ఘట్టమనేని కుటుంబ సభ్యులు అందరూ జాయిన్ అయ్యారు. పలువురు సినిమా ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు.
 





కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన బాలకృష్ణ
Balakrishna has attended the 11th day ceremony of Indiramma and consoled Krishna Mahesh Babu & Family : ఇందిరా దేవి మరణించిన రోజు నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) విదేశాల్లో ఉన్నారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ చేస్తున్నారు. అప్పుడు కృష్ణ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన... ఈ రోజు మహేష్ బాబు, ఇతర ఘట్టమనేని కుటుంబ సభ్యులను ప్రత్యేక్షంగా కలిశారు.
   





వెక్కి వెక్కి ఏడ్చిన సితార
ఇందిరా దేవి మరణించి పదకొండు రోజులు అయినప్పటికీ... ఆమె అంత్యక్రియల రోజు జరిగిన ఒక దృశ్యం ఇంకా ప్రజల కళ్ళ ముందు మెదులుతోంది. మహేష్ కుమార్తె సితార ఘట్టమనేని (Sitara Ghattamaneni) నానమ్మ మరణం తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చారు. అమ్మాయిని మహేష్ ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆ విజువల్‌ను ఇంకా అభిమానులు మర్చిపోలేకపోతున్నారు.


Also Read : Neelima Guna Gets Engaged గుణశేఖర్ కూతురి ఎంగేజ్మెంట్ - ఫొటో వైరల్!


కృష్ణ, ఇండియా దేవి దంపతులకు ఐదుగురు సంతానం. పెద్దమ్మాయి పద్మావతిని గల్లా జయదేవ్‌కు ఇచ్చి వివాహం చేశారు. రెండో అమ్మాయి మంజుల నటిగా, నిర్మాతగా ప్రేక్షకులకు తెలుసు. ఆమె భర్త సంజయ్ స్వరూప్ నటుడు. మూడో అమ్మాయి ప్రియదర్శిని యువ హీరో సుధీర్ బాబుకు ఇచ్చి పెళ్లి చేశారు. మహేష్ సోదరుడు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాలు చేశారు. 


నాకు దైవంతో సమానం : మహేష్ బాబు
తల్లి అంటే మహేష్ బాబు (Mahesh Babu) కు ఎంతో ప్రేమ. పలు సందర్భాల్లో తల్లిపై తనకు ఉన్న గౌరవాన్ని, ప్రేమను ఆయన చాటుకున్నారు. ''అమ్మ అంటే నాకు దైవంతో సమానం. నేను టెన్షన్ పడినా... ఏ విషయంలో అయినా నెర్వస్ గా అనిపించినా... అమ్మ దగ్గరకు వెళ్లి ఆవిడ పెట్టిన కాఫీ తాగుతాను. నా టెన్షన్ మొత్తం పోతుంది'' అని మహేష్ చెబుతుంటారు (Mahesh On Indira Devi).


ఏడాది ప్రారంభంలో అన్నయ్య రమేష్ బాబు (Ramesh Babu) మరణం మహేష్ బాబును ఎంతగానో బాధ పెట్టింది. ఆ బాధ నుంచి ఆయన కోలుకోవడానికి కొన్ని రోజులు పట్టిందని సన్నిహితులు చెబుతుంటారు. ఇప్పుడు తల్లి మరణం ఆయన్ను మరింత బాధకు గురి చేసింది. 


Also Read : Rashmika Mandanna : ప్రేమించడానికి టైమ్ లేదు - మా దారులు వేర్వేరు, విజయ్ దేవరకొండ గురించి రష్మిక