బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఇంటి ముందు అన్ టచ్ యూత్ ఫౌండేషన్ సభ్యులు ఆందోళనకు దిగారు. ముంబైలోని షారుక్ ఖాన్ నివాసం మన్నత్ ముందు నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఏ23 అనే ఆన్ లైన్ రమ్మీ పోర్టల్ సంస్థ... షారుక్ ఖాన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. ఏ 23 గేమ్స ప్లాట్ ఫామ్...షారుక్ ఖాన్ తో ప్రొమో షూట్ చేసి విడుదల చేసింది. చలో సాథ్ ఖేలో అంటూ షారుక్ ఖాన్ ప్రొమోలో చెప్పారు.


https://www.instagram.com/reel/CwZ8g3dsJ__/?utm_source=ig_web_copy_link


ఆన్ గేమింగ్ ప్లాట్ ఫాంలకు షారుక్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటంపై...అన్ టచ్ యూత్ ఫౌండేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏ23, జంగ్లీ రమ్మీ, జుపీ లాంటి ఆన్ లైన్ గేమింగ్స్ యువతను పాడు చేస్తున్నాయని...అలాంటి వాటిని ఎలా ప్రమోట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. గ్యాంబ్లింగ్, రమ్మీ వంటి జూదాన్ని ఎవరు ఆడినా పోలీసులు అరెస్ట్ చేస్తారని...అలాంటి ఆన్ లైన్ గేమింగ్స్ ను బాలీవుడ్ స్టార్స్ ప్రొత్సహించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. డబ్బు కోసం యువతను చెడగొట్టేలా...బాలీవుడ్ స్టార్లు అడ్వర్టయిజ్ మెంట్లు చేస్తున్నారని ఆందోళనకారులు మండిపడ్డారు.


అసలు వారంతా సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని నిలదీశారు. ఆన్ లైన్ గేమింగ్ లను ప్రమోట్ చేయడాన్ని షారుక్ వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. మన్నత్ ముందు నిరసనకు దిగిన ఆందోళనకారులను...బాంద్రా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.