Pindam Movie OTT Release: ప్రతివారం ఓటీటీలో కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. డిజిటల్‌ స్ట్రీమ్స్‌ అందుబాటులోకి వచ్చాక సినీ ప్రియులకు డబుల్‌ ఎంటర్‌టైన్‌ అవుతున్నారు. దీంతో ఓటీటీలు సైతం ప్రతివారం సరికొత్త కంటెంట్‌తో, కొత్త సినిమాల అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలా ఈ వారంలో కూడా ఓటీటీలు రెడీ అయ్యాయి. తాజాగా తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా సరికొత్త సినిమాలతో మూవీ లవర్స్‌ని అలరించేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఆహా వేదికగా లవ్, రొమాంటిక్, హర్రర్, థ్రిల్లర్ మూవీస్ సందడి చేస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్త సినిమాను అనౌన్స్‌ చేసింది ఆహా. వచ్చే నెలలో ఓ హార్రర్‌ థ్రిల్లర్‌ మూవీని డిజిటల్‌ ప్రియులకు అందించేందుకు సిద్ధమైంది. 


తాజాగా ఆ సినిమా రిలీజ్‌ డేట్‌, స్ట్రీమింగ్‌ టైంపై ప్రకటన ఇచ్చింది. కాగా గతేడాది థియేటర్లలో ప్రేక్షకులను భయంతో వణికించిన సినిమా ‘పిండం’ ది స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవర్ అనేది ట్యాగ్ లైన్. సాయి కిరణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 15న విడుదలైన పిండం మంచి విజయ్‌ సాధించింది. గర్భిణీ స్త్రీలు, చిన్నారులు ఈ చిత్రం చూడకూడదని.. సెన్సార్ బోర్డ్ ప్రకటించడంతో మూవీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ రెస్పాన్స్‌ అందుకుంది. మొత్తానికి 2023లో విడుదలైన ది బెస్ట్ హర్రర్ సినిమా అనిపించుకుంది 'పిండం'. థియేటర్లో బయపెట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో వణికించేందుకు రెడీ అవుతుంది.


ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో రిలీజ్


ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ను ఆహా లాక్‌ చేసుకుంది. కాగా పిండం డిజిటల్‌ రైట్స్‌ను ఆహా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం దీనిపై ఆహా అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. త్వరలోనే పిండం సినిమాను రిలీజ్‌ చేయబోతున్నట్టు ప్రకటించిన ఆహా తాజాగా రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేసింది. పిండం సినిమాను ఫిబ్రవరి 2న స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్టు ఆఫిషియల్‌ ప్రకటించింది సదరు సంస్థ. నల్గొండ జిల్లాలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా చేసుకుని దాని చుట్టూ ఓ కల్పిత కథాశం అల్లుకొని ఈ సినిమాను రూపొందించారు. ‘దియా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఖుషి రవి ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది. సాయి కిరణ్‌ దర్శకత్వంతో రూపొందిన సినిమాలో శ్రీరామ్, అవసరాల శ్రీనివాస్, రవివర్మ, ఖుషి రవి, ఈశ్వరీ రావు ప్రధాన పాత్రలు పోషించారు. 


Also Read: ఛీఛీ ఏం మూవీ అది.. రాధిక ఆగ్రహం - జుట్టు పీక్కుంటున్న నెటిజన్స్, మీరైనా గెస్ చేయగలరా?


‘పిండం’ కథ విషయానికి వస్తే..


అన్నమ్మ (ఈశ్వరీరావు) తన తండ్రి ద్వారా వచ్చిన తాంత్రిక జ్ఞానంతో ఎంతో మందికి సాయం చేస్తుంటుంది. ఆత్మలు ఆవహించినవారిని వాటి నుంచి విముక్తి కల్పిస్తుంటుంది. ఈ క్రమంలోనే తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్ నాథ్ (అవసరాల శ్రీనివాస్) అన్నమ్మ వద్దకు వస్తాడు. 1990ల నాటి ఓ సంఘటన గురించి అతడికి చెబుతుంది అన్నమ్మ. అదే ఆంథోనీ కుటుంబం కథ.  ఆంథోని(శ్రీరామ్‌) ఓ రైస్‌ మిల్లులో అకౌంటెంట్‌ గా పని చేస్తాడు. అతడి భార్య మేరి(ఖుషి రవి), ఇద్దరు కూతుళ్లు(సోఫియా, తార), తల్లి సూరమ్మతో కలిసి ఓ ఇంట్లో ఉంటారు. అది ఓ పురాతమైన ఇల్లు. తక్కువ ధరకు వస్తుందని భావించి కొనుగోలు చేస్తాడు. ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత వారికి ఊహించని సంఘటనలు ఎదురు అవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నారు అనేది కథాశంతో ఈ మూవీ రూపొందింది.