చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కొణిదెల (Sreeja Konidela) వ్యక్తిగత జీవితంలో మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఆమె ఏం చేస్తున్నారు? సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్టుకు అర్థం ఏమిటి? ఇప్పుడు చిత్రసీమ ప్రముఖులు, ప్రేక్షకులతో పాటు మెగా అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. అసలు, శ్రీజ కొణిదెల ఏం చెప్పారు? ఎందుకు డిస్కషన్ జరుగుతోంది? అనే వివరాల్లోకి వెళితే....
ప్రేమించే... కథాసుఖల్లో తోడుండే వ్యక్తిని కలిశా! - శ్రీజ
సంతోషంగా కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్నానంటూ... 2023కి వెల్కమ్ చెబుతూ... శ్రీజ కొణిదెల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. కొత్త ఏడాదిలోకి మాత్రమే కాదు... కొత్త వ్యక్తిని కలవడంతో పాటు, కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నట్టు ఆ పోస్ట్ చూస్తే తెలుస్తోంది.
తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని గత ఏడాది కలిశానని శ్రీజ కొణిదెల పేర్కొన్నారు. ''డియర్ 2022, నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కలిసేలా చేసినందుకు థాంక్యూ. నా గురించి తనకు బాగా తెలుసు. ఎటువంటి పరిమితులు లేకుండా ప్రేమ చూపించడంతో పాటు కష్టసుఖాల్లో ఎప్పుడూ నాకు తోడుగా ఉండే వ్యక్తి. డియర్ మి... ఫైనల్లీ నిన్ను కలవడం అద్భుతంగా ఉంది. ప్రయాణం మొదలు అవుతుంది'' అని శ్రీజ చెప్పారు.
శ్రీజ పోస్టుకు అర్థం ఏమిటంటే... తనను తాను కలిశారు. అంతే తప్ప... ఎవరో కొత్త వ్యక్తిని కాదు. దీనికి కొంత మంది వేరే వేరే అర్థాలు తీస్తున్నారు. తనకు తాను తోడుగా ఉంటూ, కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నానని ఆమె తెలిపారు. అదీ సంగతి!
Also Read : 'దిల్' రాజు ఒక్కడూ ఒకవైపు - బడా నిర్మాతలు మరోవైపు? టాలీవుడ్‌లో నయా రగడ??
కళ్యాణ్ దేవ్ కనిపించడం లేదు!
గత ఏడాది జనవరిలో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన పేరు చివర 'కళ్యాణ్'ను తొలగించి కేవలం శ్రీజ అని మాత్రమే రాశారు. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో 'శ్రీజ కొణిదెల' అని రాశారు. అప్పటి నుంచి శ్రీజ వైవాహిక జీవితం మీద వదంతులు వినిపిస్తున్నాయి. వాళ్ళిద్దరూ వేరు పడ్డారని, విడాకులు తీసుకున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి సమాచారం అందింది. అయితే, ఆ విషయాన్ని ఎప్పుడూ ఇద్దరూ అధికారికంగా వెల్లడించలేదు. కళ్యాణ్ పేరు తీసేశారు తప్ప... ఆయనతో పాటు పిల్లలతో దిగిన ఫోటోలు డిలీట్ చేయలేదు, అలాగే ఉన్నాయి.
సాధారణంగా మెగా ఫ్యామిలీ వేడుకల్లో అందరూ కనిపిస్తారు. కానీ, కొన్ని రోజులుగా కళ్యాణ్ దేవ్ ఎక్కడా కనిపించడం లేదు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కొందరు డివోర్స్ కామెంట్స్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ కూడా ఈ విషయం మీద మౌనం వహించింది. కాకపోతే మెగాస్టార్ చిరంజీవి డాటర్ కావడంతో ఆమె వ్యక్తిగత జీవితం మీద ఎక్కువ మందికి ఆసక్తి ఉండటం సహజమే. రామ్ చరణ్ ఆ మధ్య ముంబై వెళ్ళినప్పుడు శ్రీజ కూడా అతనితో కనిపించారు. అందువల్ల, చరణ్ కెరీర్ ప్లానింగులో ఆమె సలహాలు, సూచనలు ఇస్తున్నారా? అనే చర్చ కూడా మొదలైంది.
శ్రీజతో వివాహమైన తర్వాత కళ్యాణ్ దేవ్ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు. 'విజేత', 'సూపర్ మచ్చి' సినిమాలు చేశారు. 'కిన్నెరసాని' సినిమా ఓటీటీలో విడుదల అయ్యింది. ఇప్పుడు ఆయన సినిమాలు ఏవీ చేయడం లేదు. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు.
Also Read : పార్టీలో లిప్ కిస్ ఇస్తూ దొరికేసిన తమన్నా - హైదరాబాదీ నటుడితో డేటింగ్