యువ కథానాయకుడు శ్రీ విష్ణు (Sree Vishnu) చాలా సాఫ్ట్ పర్సన్. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆయనకు వివాదరహితుడిగా పేరు ఉంది. అటువంటి హీరోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలోని యాగంటిలో ఇబ్బంది ఎదురైంది. ఆయన కారు ఆపేసిన కూలీలు గొడవకు దిగారు. అందుకు కారణం ఏమిటి? అక్కడ ఏమైంది? వంటి వివరాల్లోకి వెళితే... 


యాగంటిలో శ్రీ విష్ణు 'స్వాగ్' షూటింగ్‌
శ్రీ విష్ణు కథానాయకుడిగా 'స్వాగ్' అని ఓ సినిమా రూపొందుతోంది. అందులో మన హైదరాబాదీ అమ్మాయి రీతూ వర్మ హీరోయిన్. ప్రస్తుతం ఏపీలోని నంద్యాలలోని బనగానెపల్లె మండలం యాగంటి క్షేత్రంలో జరుగుతోంది. సన్నివేశాలకు భారీ ఎత్తున ప్రజలు అవసరం అయ్యారు. అందుకు దగ్గరలోని కూలీలలను తీసుకు వచ్చారు ప్రొడక్షన్ మేనేజర్లు & కో ఆర్డినేటర్లు. 


'స్వాగ్' చిత్రీకరణలో పాల్గొనడానికి వచ్చిన కూలీలకు డబ్బులు ఇవ్వడం లేట్ అయ్యింది. దాంతో షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో సుమారు 400 మంది కూలీలు ఆందోళన చేయడం మొదలు పెట్టారు. ఆ సమయంలో లొకేషన్ నుంచి వెళుతున్న హీరో శ్రీ విష్ణు కారును అడ్డగించారు. తమకు డబ్బులు ఇవ్వాలని ఇబ్బంది పెట్టారు. గొడవ గురించి తెలుసుకున్న పోలీసులు సీనులోకి ఎంటర్ అయ్యారు. హీరోకి, డబ్బులు ఇవ్వడానికి సంబంధం లేదని కూలీలకు సర్దిచెప్పి హీరోని అక్కడ నుంచి పంపించేశారు. 


Also Readమహేష్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్... నటుడిగా వేణు స్వామి ఫ్లాప్ షో, అందుకే, ఇండస్ట్రీ మీద పడ్డారా?


'సామజవరగమన' విజయం తర్వాత
శ్రీ విష్ణు గత ఏడాది (2023లో) 'సామజవరగమన'తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న సినిమా 'స్వాగ్'. విశాల్ 'మార్క్ ఆంటోనీ' సినిమాతో గత ఏడాది తమిళ, తెలుగు ప్రేక్షకులను రీతూ వర్మ పలకరించారు. 


Also Read'మిస్ పర్ఫెక్ట్'గా మెగా కోడలు లావణ్య - పెళ్లైన తర్వాత కుమారిగా


శ్రీ విష్ణు, రీతూ వర్మ జంటగా నటిస్తున్న 'స్వాగ్' సినిమాలో మరో కథానాయికకు కూడా చోటు ఉందట. ఆ పాత్రకు మీరా జాస్మిన్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఆ విషయాన్ని దర్శక నిర్మాతలు అధికారికంగా వెల్లడించలేదు.



'సామజవరగమన' విజయంలో కామెడీది కీలక పాత్ర
శ్రీ విష్ణు కెరీర్ మొత్తంలో 'సామజవరగమన' బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి. అందుకు కారణం సినిమాలో కామెడీయే. వినోదంతో విజయం సాధ్యమైంది. ఆ కథ విషయానికి వస్తే... బాలు (శ్రీ విష్ణు) ఏషియన్ మల్టీప్లెక్స్ టికెట్ కౌంటర్ ఉద్యోగి. ఆయనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్! బాబాయ్, మేనత్తలు పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంటారు. బాలు తాతయ్య కోటీశ్వరుడు. పిల్లలకు ఆస్తి చెందాలంటే డిగ్రీ చేయాలని కండిషన్ పెడతారు. బాలు తండ్రి 30 ఏళ్లుగా (సీనియర్ నరేష్) డిగ్రీ పరీక్షలు రాస్తుంటాడు. ఆయనకు సప్లీ పరీక్షల్లో పరిచయమైన సరయు (రెబా మోనికా జాన్)తో ప్రేమలో పడతాడు బాలు. ప్రేమ పేరుతో తనకు దగ్గర కావాలని చూసే అమ్మాయిలతో రాఖీ కట్టించుకునే బాలు... సరయుతో ఎలా ప్రేమలో పడ్డాడు? ప్రేమించిన సరయు తనకు భార్యగా ఇంటికి వస్తుందని ఆశిస్తే... బావ పెళ్లి కారణంగా చెల్లి అవుతుందని తెలిసి ఏం చేశాడు? సరయు కుటుంబ నేపథ్యం ఏమిటి? బాలు తండ్రి డిగ్రీ పాస్ అయ్యాడా? లేదా? అనేది సినిమా.