బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అయితే ఆర్యన్ కు మద్దతుగా బాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది పోస్ట్ లు పెట్టారు. సల్మాన్ ఖాన్ స్వయంగా షారుఖ్ ఇంటికి వెళ్లి అతడిని కలిసొచ్చారు. హృతిక్ రోషన్, పూజా భట్, సునీల్ శెట్టి వంటి తారలు ఆర్యన్ కు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. రీసెంట్ గా సీనియర్ నటి రవీనా టాండన్ కూడా ఆర్యన్ అరెస్ట్ పై మండిపడుతూ.. అధికారులను తిట్టిపోసింది. సిగ్గులేని రాజకీయాలు ఓ యువకుడి జీవితం, భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 


Also Read:  సమంత తల్లికావాలనుకుంది..కానీ ఆ ఒక్కనెలలో ఏం జరిగిందంటే..'శాకుంతలం' నిర్మాత షాకింగ్ కామెంట్స్


ఇక తాజాగా నటి సోమీ అలీ కూడా తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే ఆమె మాటలు చాలా మందికి షాకిచ్చాయి. పిల్లలు డ్రగ్స్ వాడటం సహజమని.. తను కూడా పదిహేడేళ్ల వయసులో దివ్యభారతితో కలిసి డ్రగ్స్ ట్రై చేశానని చెప్పింది. ఇందులో పెద్ద వింతేమీ లేదని తెలిపింది. అమెరికా లాంటి కంట్రీ ఎప్పటినుంచో డ్రగ్స్ కోసం పోరాడుతోందని.. కానీ ఇప్పటికీ అక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయని.. వాటిని పూర్తిగా తొలగించలేమని చెప్పింది. అలానే వ్యభిచారం కూడా.. 


డ్రగ్స్, వ్యభిచారం తప్పేం కాదు.. ఆర్యన్ ను వదిలేయండి.. చిన్నపిల్లాడిపై ప్రతాపం చూపించే బదులు రేపిస్ట్ లను, క్రిమినల్స్ ను పట్టుకోండి అంటూ సోమీ రాసుకొచ్చింది. అయితే ఆమె చేసిన ఈ కామెంట్స్ పై సోషల్ యాక్టివిస్ట్ లు మండిపడుతున్నారు. పిల్లలు తప్పు చేస్తే మందలించాల్సింది పోయి డ్రగ్స్ తీసుకోమని, వ్యభిచారం చేయమని ఎంకరేజ్ చేయడమేంటంటూ తిడుతున్నారు. మరోపక్క ఇండస్ట్రీ వాళ్లకు కూడా సోమీ మాటలు ఆగ్రహానికి గురిచేశాయి. చనిపోయిన దివ్య భారతిని దీనిలోకి లాగడం ఎందుకంటూ క్లాస్ పీకుతున్నారు. 


ఒకప్పుడు సోమ్ సల్మాన్ ఖాన్ తో రిలేషన్ లో ఉండేది. చాలా కాలం ప్రేమించుకున్న ఈ జంట ఆ తరువాత విడిపోయారు. సల్మాన్ ఖాన్ తనని మోసం చేశాడని.. అతనికి ఎంతమంది అమ్మాయిలతో రిలేషన్ ఉందో లెక్కే లేదని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేసింది సోమీ. 






 


Also Read: అఖిల్ కి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఈవెంట్ లో చైతు..


Also Read:ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి