Ayalaan : శివకార్తికేయన్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా  రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా 'అయలాన్'. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో నాలుగేళ్ల గ్యాప్ త‌ర్వాత ర‌కుల్ ప్రీత్ సింగ్ కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుండడం విశేషం. కేజేఆర్ స్టూడియోస్, 24ఎఎం స్టూడియోస్ పథకాలపై కోటపాడి జె. రాజేష్, ఆర్.డి. రాజా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా ఈ సినిమాను దీపావళి కానుకగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దాంతో పాటు మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా రివీల్ చేశారు.


పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానున్న'అయలాన్' ఫస్ట్ లుక్ అందర్నీఅట్రాక్ట్ చేస్తోంది. ఈ పోస్టర్ ను గనక పరిశీలిస్తే ఏలియన్ తో పాటు శివకార్తికేయన్ నీటిలో ఈదడం కనిపిస్తోంది. సౌత్ ఇండియాలోనే ఈ తరహా సినిమా రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ మూవీపై సినీ ప్రేక్షకులు అమితంగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంతకు ముందు కొన్ని సైన్స్ ఫిక్షన్ మూవీస్ వచ్చినప్పటికీ ఏలియన్ ప్రధాన పాత్రలో రావడం మాత్రం దక్షిణాది భాషల్లో రాలేదు. దీంతో ఏలియ‌న్స్ బ్యాక్‌డ్రాప్‌లో ద‌క్షిణాది చిత్రసీమ‌లో తెర‌కెక్కుతోన్న తొలి సినిమాగా ఈ మూవీ నిలవనుంది.




దీపావళి కానుకగా 'అయలాన్'ను ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాత కోటపాడి జె. రాజేష్ తెలిపారు. ఈ ఏడాది నవంబర్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని.. ఈ జర్నీలో తమకు ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ ధైర్యాన్ని కోల్పోలేదని చెప్పారు. పట్టుదలతో సినిమా చేశామని చెప్పారు. 


'అయలాన్'లో 4500లకు పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయని, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్న ఫుల్ లెంగ్త్ లైవ్ యాక్షన్ సినిమా ఇదేనని మూవీ టీం తెలియజేసింది. పలు సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ఫాంటమ్ ఎఫ్ఎక్స్ కంపెనీ 'అయలాన్'లో ఏలియన్ సహా ఇతర గ్రాఫిక్స్ వర్క్ చేసిందని తెలిపింది. పర్ఫెక్షన్ కోసం ప్రయత్నించడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కోసం ఎక్కువ సమయం పట్టిందని స్పష్టం చేసింది.






ఇక మరో ముఖ్య విషయమేమిటంటే 'అయలాన్'తో నాలుగేళ్ల గ్యాప్ త‌ర్వాత ర‌కుల్ ప్రీత్‌సింగ్‌ కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది. 2019లో హీరో సూర్య నటించిన ఎన్జీకే మూవీలో నటించిన ఆమె..  ఆ తర్వాత ఎక్కువగా బాలీవుడ్ కే పరిమితమైంది. ఇదిలా ఉండగా ఈ మూవీలో ఇషా కొప్పిక‌ర్‌, శ‌ర‌ద్ ఖేల్కర్‌, సీనియర్ హీరోయిన్ భానుప్రియ, యోగిబాబు, కరుణాకరన్, బాల శరవణన్ తదితరులు కీల‌క పాత్రల‌ను పోషిస్తున్నారు.  


శివకార్తికేయన్ సినిమా విషయాలకొస్తే ఆయన 'మావీరన్' (Maaveeran)‌లోనూ నటిస్తున్నాడు. తెలుగులో ‘మ‌హావీరుడు’ టైటిల్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. స్టార్ డైరెక్టర్‌ శంక‌ర్ కూతురు అదితి శంక‌ర్ ఫిమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.


Read Also: ఎట్టకేలకు ‘జవాన్’లో అల్లు అర్జున్? పుష్పరాజ్ ఫ్యాన్స్‌కు పూనకాలేనట!