అద్భుత దృశ్య కావ్యం ‘సీతారామం’


దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా ‘సీతారామం’. ఈ ఏడాది టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అద్భుత ప్రేమ కావ్యంగా ప్రేక్షకులను అలరించింది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల జోరు కొనసాగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 85 కోట్లు సాధించింది.  తెలుగులో రూ. 40 కోట్లు వసూళు చేసింది. ఈ చిత్రంలో  లెఫ్టినెంట్ రామ్ గా దుల్క‌ర్‌ సల్మాన్, సీత పాత్ర‌లో మృణాల్ ఠాకూర్ అద్భుత నటన కనబర్చారు. వీరి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. రష్మిక మందన్న పాత్ర కూడా ఈ సినిమాకు మంచి ప్లస్ అయ్యింది. ఈ ఏడాది మంచి విజయాలు సాధించిన బింబిసార, కార్తికేయ-2 సరసన ఈ సినిమా కూడా నిలిచింది.   


ఈ నెల 18 నుంచి హాట్ స్టార్ లో హిందీ వెర్షన్ స్ట్రీమింగ్


తాజాగా ఈ సినిమా హిందీ వెర్షన్ ఓటీటీ వేదికగా విడుదల కాబోతుంది. ఈమేరకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ చిత్రానికి సంబంధించిన హిందీ ట్రైలర్ రిలీజ్ చేసింది. ఈనెల 18 నుంచి ఈ మూవీ తమ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ కాబోతున్నట్లు వెల్లడించింది. ఈ సినిమాపై ఇప్పటికే పలువురు బాలీవుడ్ దిగ్గజ దర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ‘ది కార్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ‘సీతారామం’ ఓ అద్భుత దృశ్య కావ్యంగా అభివర్ణించారు. నార్త్ టు సౌత్ ఫిల్మ్ మేకర్స్ అందరూ ఈ చిత్రాన్ని ప్రశంసించారు. దర్శకుడి ప్రతిభను, హీరో, హీరోయిన్ల నటనను అభినందించారు. ఈ సినిమా బాగా లేదని ఏ ప్రేక్షకుడు కూడా చెప్పకపోవడం విశేషం.  దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన పాత్రలను దర్శకుడు మలిచిన తీరుపై అద్భుతం అని కొనియాడారు. ఆర్మీ, విదేశీ రహస్యాలు, ప్రేమకథ కలగలుపుగా కొనసాగిన అద్భుత చిత్రం ‘సీతారామం’. ఈ చిత్రంలో కొనుగోలు చేసింది. ఈ సినిమాలో సుమంత్ నెగెటివ్ ఛాయలున్న క్యారెక్ట్ చేశాడు.






ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్


అటు ఇప్పటికే ‘సీతారామం’ మూవీ సెప్టెంబర్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.  భారీ మొత్తాన్ని చెల్లించి ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఓటీటీలోనూ ఈ సినిమాకు మంచి ప్రేక్షకాదరణ దక్కింది. పెద్ద సంఖ్యలో అమెజాన్ ప్రైమ్ వినియోగదారులు ఈ సినిమాను చూశారు.   


Read Also: RRR-2పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి, త్వరలోనే గుడ్ న్యూస్?