సింగర్ సునీతకు టాలీవుడ్ లో ఉన్న క్రేజే వేరు. తన గాత్రంతో లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారు. వ్యక్తిగతంగా.. వృత్తిపరంగా ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నా.. ఈరోజు కెరీర్ లో దూసుకెళ్తున్నారు. ఇటీవల సునీత రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్, వివాహం ఇలా చాలా విషయాలపై స్పందించింది. 


టీనేజ్ లో ఉన్నపుడు అమ్మాయిలు తన జీవిత భాగస్వామి తనను బాగా చూసుకోవాలని.. ప్రేమించాలని.. ఊహల లోకంలో విహరిస్తుంటుందని.. కెరీర్ ప్రారంభమైన కొత్తలో తను కూడా అలాంటి ప్రపంచంలో ఉన్నానని చెప్పుకొచ్చింది. కానీ మొదటి పెళ్లి తరువాత ఎన్నో విషయాలు తెలిసొచ్చాయని.. అసలు జీవితమంటే ఏంటో అప్పుడే తెలిసిందని చెప్పింది. మొదటి పెళ్లి బ్రేకప్ తరువాత దాదాపు పదిహేనేళ్ల పాటు ఒంటరిగానే ఉన్నానని.. ఆ సమయంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని వివరించింది. తనకు తగిలిన దెబ్బల కారణంగా మనుషులను నమ్మకం మానేశానని చెప్పుకొచ్చింది. 


రెండో పెళ్లి తరువాత జీవితం బాగుందని.. రామ్ చాలా మంది వ్యక్తి అని తెలిపింది. పెళ్లి ప్రపోజల్ తో ఆయన తన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనలో నిజాయితీ కనిపించిందని.. అదే నచ్చి పెళ్లికి ఒప్పుకున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయంలో చాలా మంది ఆడవాళ్లు తన గురించి తప్పుగా మాట్లాడుకున్నారని.. తన బాధ్యతలన్నీ ఎవరో వ్యక్తి చూసుకుంటున్నారని కామెంట్స్ చేసినట్లు చెప్పింది. 
డబ్బు కోసం రామ్ ని పెళ్లి చేసుకున్నానని చాలా మంది అన్నారని. నిజానికి రామ్ కి ఎంత ఆస్తి ఉందో కూడా తనకు తెలియదని.. ఆయన కంపెనీ టర్నోవర్ ఎంతో ఐడియా లేదని.. మా ఇద్దరి మధ్య మంది అనుబంధం ఉందని.. ఒకరిపై మరొకరిని గౌరవం ఉందని చెప్పుకొచ్చింది. 


మ్యూజిక్ డైరెక్టర్ భార్య అవమానించింది.. 


పాతికేళ్ల వయసులో పాట పాడడానికి మ్యూజిక్ స్టూడియోకి వెళ్లగా.. అక్కడ ఆ డైరెక్టర్ తన చేతిలో ఉన్న మైక్ ను ఇవ్వగా.. దాన్ని తీసుకొని పాట పాడేసి మైక్ అక్కడే పెట్టి వచ్చేసిందట సునీత. ఆ తరువాత మ్యూజిక్ డైరెక్టర్ భార్య తన దగ్గర వచ్చి.. ''నువ్ ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా..?'' అని అవమానించారట. ''నేనేం చేశానండి'' అని సునీత అడగ్గా.. ''నువ్ మైక్ తీసుకునే సమయంలో నీ చేతివేళ్లు ఆయనకు తగిలాయి.. అంటే నీ ఉద్దేశం ఏంటి?'' అని అడిగేసరికి తన స్టైల్ లో సమాధానం ఇచ్చిందట సునీత. కానీ ఆ ఘటనతో తనకు ఎంతో బాధేసిందని.. చాలా ఏడ్చేశానని.. ఇలాంటి ఘటనలు తన  జరిగాయని చెప్పుకొచ్చారు.  


Also Read : Nayanthara Engagement: డైరెక్టర్ తో లవ్ ఎఫైర్.. తొలిసారి స్పందించిన నయనతార..


Sonal Chauhan Photos : సోనాల్ చౌహన్ అందాల జాతర.. చూపు తిప్పుకోలేం..