బెంగళూరులో జరుగుతున్న హంపీ ఉత్సవాల్లో పాల్గొన్న బాలీవుడ్ గాయకుడు కైలేష్‌ ఖేర్‌ కు చేదు అనుభవం ఎదురైంది. స్టేజి మీద పాటలు పాడుతున్న సమయంలో, ఆయనపై కొంతమంది ఆకతాయిలు నీళ్ల బాటిళ్లు విసిరారు. అయినప్పటికీ, తను  కార్యక్రమాన్ని అలాగే కొనసాగించారు. ఈ దాడికి యత్నించిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


హంపీ ఉత్సవాల్లో పాల్గొన్న కైలాష్ ఖేర్


కర్నాటక ప్రభుత్వం ప్రతి ఏటా హంపీ ఉత్సవాలను నిర్వహిస్తున్నది. అందులో భాగంగానే బెంగళూరులో ఈ వేడుకలు జరుగుతున్నాయి. జనవరి 27 నుంచి ఈ వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. ఈ ఉత్సవాల్లో పలు ప్రాంతాలకు సంబంధించిన గాయకులు, కళాకారులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తున్నారు. తమ పాటలు, కచేరీలతో ఆకట్టుకుంటున్నారు. ఇందులో భాగంగానే గాయకుడు కైలాష్ ఖేర్ సైతం ఉత్సవాల్లో పాల్గొన్నారు. తన బృందంతో ప్రత్యేకంగా పాటల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీమ్ చక్కటి భక్తి పాటలు పాడుతూ వేడుకలకు హాజరైన జనాలను అలరించింది.






కైలాష్ ఖేర్ పై బాటిళ్లు విసిరిన యువకులు


ఓవైపు ఆయన పాటలతో ప్రజలు ఎంజాయ్ చేస్తుండగా, మరోవైపు కొంత మంది ఆకతాయిలు రెచ్చిపోయారు.  స్టేజ్‌పై ఆయన పాటలు పాడుతుండగా ఇద్దరు యువకులు వాటర్ బాటిళ్లు విసిరారు. అయితే ఆ బాటిళ్లు కైలాష్‌ తగలకుండా పక్కనే పడిపోయాయి. కాసేపు అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాక ప్రేక్షకులు చూస్తూ ఉండిపోయారు. మరోవైపు వాటర్ బాటిళ్లు తన సమీపంలో పడినప్పటికీ కైలేష్‌ ఖేర్‌ పట్టించుకోలేదు.  పాటల కార్యక్రమాన్ని అలాగే కొనసాగించారు. స్టేజి మీద పడిన బాటిళ్లను అక్కడి సిబ్బంది వచ్చి వెంటనే తొలగించారు.






విచారణలో ఎందుకు బాటిళ్లు విసిరారో వెల్లడించిన యువకులు


మరోవైపు ఈ దాడికి పాల్పడిన యువకులను సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. వీపు విమానం మోతమోగించి పోలీసులకు అప్పగించారు.  అనంతరం ఆ యువకులను పోలీసులు విచారించారు. అయితే, కన్నడ పాటలు పాడకుండా, ఆయన కేవలం హిందీ పాటలే పాడుతున్నారని, అందుకే తమకు కోపం వచ్చిందని వెల్లడించారు. ఈ కోపంలోనే తనపై వాటర్ బాటిళ్లు విసిరినట్లు  సదరు యువకులు చెప్పారట.  సదరు యువకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పలు సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.


Read Also: ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్, ప్రభాస్-హృతిక్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ మూవీ?