నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికను ఎంపిక పూర్తయింది. హీరోగా బాలకృష్ణకు 107వ సినిమా ఇది. ఇందులో శ్రుతీ హాసన్ కథానాయికగా నటించనున్నారు. బాలకృష్ణ, శ్రుతీ హాసన్ ఇప్పటివరకూ సినిమా చేయలేదు. వాళ్లిద్దరి కలయికలో ఇదే తొలి సినిమా. దర్శకుడు గోపీచంద్ మలినేనితో శ్రుతీ హాసన్‌కు మూడో చిత్రమిది. ఇంతకు ముందు 'బలుపు', 'క్రాక్' సినిమాలు చేశారు. ఆ రెండు సినిమాల్లోనూ రవితేజ హీరో. 'క్రాక్' విజయం తర్వాత బాలకృష్ణతో గోపీచంద్ మలినేని సినిమా చేస్తున్నారు. హీరో మారారు కానీ హీరోయిన్ మారలేదు.
దీపావళి సందర్భంగా శ్రుతీ హాసన్ తమ సినిమాలో కథానాయికగా నటిస్తున్నట్టు దర్శకుడు గోపీచంద్ మలినేని వెల్లడించారు. "మళ్లీ మేం కలిసి పని చేస్తున్నాం. ఇది మూడోసారి... మా కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా చేసే దారిలో ఉన్నాం" అని గోపీచంద్ మలినేని ట్వీట్ చేశారు. ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఆమెకు వెల్కమ్ చెప్పింది.
బాలకృష్ణ లాస్ట్ సినిమాలు చూస్తే... హీరోయిన్లు నయనతార, సోనాల్ చౌహన్, రాధికా ఆప్టేలను రిపీట్ చేశారు. 'యన్.టి.ఆర్' బయోపిక్ లో విద్యా బాలన్ నటించారు. తర్వాత 'అఖండ'లో ప్రగ్యా జైస్వాల్ ను ఎంపిక చేశారు. ఇప్పుడు శ్రుతీ హాసన్... దాంతో బాలకృష్ణ సరసన కొత్త కథానాయికలను చూసే అవకాశం ప్రేక్షకులకు కలుగుతోంది.
Also Read: 'మంచి రోజులు వచ్చాయి' సమీక్ష: మంచి నవ్వులు వచ్చాయి! కానీ...
Also Read: 'పెద్దన్న' సమీక్ష: ఇదేంటన్నయ్యా... ఇలాగైతే కష్టమే!
Also Read: ఎనిమీ రివ్యూ: ఈ ఎనిమీ.. యాక్షన్ లవర్స్‌ను మెప్పిస్తాడు
Also Read: రవితేజ వర్సెస్ బెల్లంకొండ... రియల్ టైగర్ ఎవరు? ఎవరి టైగర్ ముందు?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి