Shriya Saran: అందుకే నా ప్రెగ్నెన్సీ గురించి బయటకు చెప్పలేదు: నటి శ్రియ

నటి శ్రియ శరణ్ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచిన సంగతి తెలిసిందే. అకస్మాత్తుగా ఆమె.. బిడ్డతో కనిపించేసరికి అభిమానులు షాకయ్యారు. ఎట్టకేలకు శ్రీయా తన ప్రెగ్నెన్సీపై నోరు విప్పింది.

Continues below advertisement

టాలీవుడ్ లో ఒకప్పటి టాప్ హీరోయిన్ లలో నటి శ్రియ శరన్ ఒకరు. ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది శ్రియ. కేవలం ఒక్క తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా శ్రియ అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఆమె ఇటీవల హిందీ ‘దృశ్యం 2’లో నటించింది. ఆ సినిమా బాలీవుడ్‌లో మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం సక్సెస్ ఎంజాయ్ చేస్తోంది శ్రియ. అయితే శ్రియ గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ ఇంటర్వ్యూలో శ్రియను తన ప్రెగ్నెన్సీ గురించి అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 

Continues below advertisement

నటి శ్రియ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది శ్రియ. గతంలో శ్రియ తాను గర్భవతి అయిన విషయాన్ని దాచిన సంగతి అందరికీ తెలిసిందే. 2018లో శ్రియ రష్యా దేశానికి చెందిన ఆండ్రూ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే అప్పటి నుంచి శ్రియ బయట కనిపించడం తక్కువే. అయితే ఉన్నట్టుండి 2021 అక్టోబర్‌లో తనకు అమ్మాయి పుట్టిందని చెప్పింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఆమె ప్రెగ్నెంట్ ఎప్పుడయ్యిందంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై ఆమె పెద్దగా స్పందించలేదు. 

అయితే ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో శ్రియ తాను ప్రెగ్నెంట్ అన్న సంగతిని ఎందుకు దాచిందో అనే విషయాన్ని బయట పెట్టింది. తాను 2020 లాక్ డౌన్ సమయంలోనే గర్భవతిని అయ్యానని, 2021 జనవరి 10న అమ్మాయి పుట్టిందని ఈ విషయాన్ని తర్వాత బయటపెట్టినట్టు చెప్పుకొచ్చింది. ఆ సమయంలో లాక్ డౌన్ ఉండటం వలన తన ప్రెగ్నెన్సీ విషయం ఎవరికీ తెలియలేదని అంది. అలా ఎందుకు చేశారు అని అడిగితే.. అవమానాలకు భయపడే ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని దాచానని చెప్పడం షాకింగ్ మారింది.

ప్రెగ్నెన్సీ వస్తే శరీరంలో చాలా మార్పులు వస్తాయిని, బరువు కూడా పెరగొచ్చు అని చెప్పింది. బరువు పెరిగితే తాను బాడీ షేమింగ్ కు గురి కావచ్చని, అవన్నీ మానసికంగా తనను ఎంతో ఇబ్బందికి గురిచేస్తాయని చెప్పింది. దీనిపై సోషల్ మీడియాలో ఎక్కడ ట్రోలింగ్ చేస్తారో అని భయపడ్డానని, ఎందుకంటే తన బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నానని అందుకే ప్రెగ్నెన్సీ విషయం బయటకు చెప్పలేదని షాకింగ్ కామెంట్స్ చేసింది శ్రియ.

ప్రస్తుతం శ్రియ వరుస సినిమాల్లో నటిస్తోంది. రెండు తరాల హీరోలతో కలసి నటించిన ఈ బ్యూటీ ఇప్పటికిీ ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది. తెలుగులో అరకొర సినిమాలు చేస్తున్నా.. అటు బాలీవుడ్ లోనూ మంచి అవకాశాలు దక్కించుకుంటోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాలో నటుడు అజయ్ దేవగణ్ భార్యగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Also Read : నేను బతికే ఉన్నా - నటి వీణా కపూర్ మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్

Continues below advertisement