బాలీవుడ్ స్టార్ హీరోలలో రణబీర్ కపూర్ ఒకరు. అతడు చివరిగా 'సంజు' అనే సినిమాలో కనిపించారు. నాలుగేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. ఆ సినిమా రిజల్ట్ చూసే రణబీర్ తో 'షంషేరా', 'బ్రహ్మాస్త్ర' వంటి సినిమాలను లైన్ లో పెట్టారు దర్శకనిర్మాతలు. రూ.150 కోట్ల బడ్జెట్ తో తీసిన 'షంషేరా' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 


యశ్ రాజ్ ఫిలిమ్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ తెరకెక్కించిన ఈ సినిమాకి కరణ్ మల్హోత్రా దర్శకుడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు. మీడియాలో కూడా ఈ సినిమాకి నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకుల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ రాలేదు. దీంతో కలెక్షన్స్ పై ఎఫెక్ట్ బాగా కనిపిస్తోంది. 


శుక్రవారం నాడు విడుదలైన ఈ సినిమా ఆదివారం నాటికి రూ.30 కోట్లు రాబట్టింది. ఆ తరువాత నుంచి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. సోమవారం నాడు ఈ సినిమా రూ.2.75 నుంచి రూ.3 కోట్లు మాత్రమే రాబట్టింది. పూర్తి రన్ లో ఈ సినిమా మహా అయితే రూ.40 కోట్లకు మించి వసూలు చేయలేదని తెలుస్తోంది. 


ఇప్పుడు ఈ సినిమా ఎఫెక్ట్ సెప్టెంబర్ 9న విడుదల కాబోతున్న 'బ్రహ్మాస్త్ర' సినిమాపై పడే ఛాన్స్ ఉంది. రిలీజ్ కు కేవలం 45 రోజుల సమయమే ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో బజ్ రావడం లేదు. ట్రైలర్ లో చూపించిన గ్రాఫిక్స్ మీద ట్రోల్స్ పడ్డాయి. పైగా ఈ సినిమాను మూడు భాగాలుగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ పార్ట్ రిజల్ట్ ఏమాత్రం తేడా కొట్టినా.. రెండో దానిపై ఆసక్తి పోతుంది. 


Also Read: ఈ వారం విడుదల కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే!


Also Read: నాని సినిమాలో ఇంటెన్స్ లవ్ స్టోరీ - ప్లస్ అవుతుందా?