Shah Rukh Khan: ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ రీడర్ పోల్‌లో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ మొదటి స్థానంలో నిలిచారు. ఈ టైమ్100 రీడర్ పోల్‌లో మ్యాగజైన్ వినియోగదారులు తాము ఇష్టపడ్డ వ్యక్తులకు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఓట్లు వేసి గెలిపించవచ్చు.


ఆస్కార్ అవార్డు గెలుచుకున్న మిషెల్ యో (Michelle Yeoh), ప్రముఖ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ (Serena Williams), మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg), బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాకియో లులా డ సిల్వలను సైతం వెనక్కి నెట్టి కింగ్ ఖాన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.


ఈ ఓటింగ్‌లో షారుక్ ఖాన్‌కు నాలుగు శాతం ఓట్లు లభించాయి. దాదాపు 12 లక్షల మంది షారుక్‌కు ఓటు వేశారు. స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ఇరానీ మహిళలకు రెండో శాతం దక్కింది. వీరికి మూడు శాతం ఓట్లు లభించాయి. వీరి తర్వాత హెల్త్ కేర్ వర్కర్లు మూడో స్థానంలో నిలిచారు. ప్రిన్స్ హ్యారీ, మేగాన్‌లు 1.9 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. ఇక ఐదో స్థానం ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీకి దక్కింది. మెస్సీకి 1.8 శాతం ఓట్లు పడ్డాయి.


షారుఖ్ ఖాన్ లేటెస్ట్ సినిమా ‘పఠాన్’, ‘బాహుమలి 2’ హిందీ రికార్డును బద్దలు కొట్టింది. జక్కన్న సినిమాను మించి వసూళ్లను సాధించింది. 'బాహుబలి 2' హిందీలో భారీ విజయం సాధించడమే కాదు, ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా చరిత్రకు ఎక్కింది. 'బాహుబలి 2' హిందీ వెర్షన్ రూ. 510 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డును బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ 'పఠాన్' సినిమా బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు 'పఠాన్' సినిమా రూ. 530 కోట్లు వసూలు చేసింది. ఇంకా థియేటర్లలో ఆడుతోంది. సినిమాకు ఇంకా వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇండియాలో హయ్యెస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా మాత్రమే కాదు, ఫస్ట్ డే, ఫస్ట్ వీక్, ఫస్ట్ మంత్ - ఇలా 'బాహుబలి ' క్రియేట్ చేసిన చాలా రికార్డులను 'పఠాన్' బీట్ చేసింది.


సౌత్ సినిమా అయిన 'బాహుబలి 2' క్రియేట్ చేసిన రికార్డులు బీట్ చేయడానికి బాలీవుడ్ ఇండస్ట్రీకి ఏడు ఏళ్ళు పట్టింది. ఇక కలెక్షన్ల పరంగా షారుఖ్, ప్రభాస్ ఒకటి, రెండు స్థానాల్లో ఉంటే, ఆ తర్వాత కన్నడ సెన్సేషన్ యశ్ హీరోగా నటించిన 'కె.జి.యఫ్ : చాఫ్టర్ 2' ఉంది. ఆ సినిమా రూ. 434 కోట్లు కలెక్ట్ చేసింది. అమీర్ ఖాన్ 'దంగల్' (రూ. 387.38 కోట్లు)తో 4వ స్థానంలో, రణబీర్ కపూర్ 'సంజు' (రూ. 342 కోట్లు)తో 5 స్థానంలో ఉన్నాయి.


ఆ తర్వాతి స్థానాల్లో ఆమిర్ ఖాన్ 'పీకే' (రూ. 340 కోట్లు), సల్మాన్ ఖాన్ 'టైగర్ జిందా హై' (రూ. 339 కోట్లు), 'భజరంగీ భాయిజాన్' (రూ. 320 కోట్లు), హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన 'వార్' (రూ. 317 కోట్లు), దీపికా పదుకోన్ 'పద్మావత్' (రూ. 302 కోట్లు) నిలిచాయి. ఈ వసూళ్లు హిందీ బెల్ట్ లోవి మాత్రమే.