ప్రపంచంలోనే బాలీవుడ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అతిపెద్ద, అత్యంత విజయవంతమైన చిత్ర పరిశ్రమగా కొనసాగుతోంది. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్, రణవీర్ సింగ్ తో పాటు పలువురు స్టార్లు బాలీవుడ్ నుంచి ఎదిగారు. ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందడంతో పాటు సంపాదనలోనూ అదుర్స్ అనిపిస్తున్నారు. బాలీవుడ్ బాద్ షా గా గుర్తింపు తెచ్చుకున్న షారుఖ్ సంపాదనలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు.
ప్రపంచ ధనిక నటుల లిస్టులో షారుఖ్ కు 4వ స్థానం
నటుడు, నిర్మాత, వ్యాపరవేత్తగా కొనసాగుతున్న షారుఖ్ ఖాన్ తాజాగా విడుదలైన 'ప్రపంచంలోని అత్యంత ధనిక నటుల' టాప్ 10 జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఈ లిస్టులో భారత్ నుంచి ప్లేస్ దక్కించుకున్న ఒకే ఒక్క నటుడు ఆయన. డ్వేన్ జాన్సన్, టామ్ క్రూజ్, జార్జ్ క్లూనీ, రాబర్ట్ డి నీరో వంటి అంతర్జాతీయ ప్రముఖులతో ఈ లిస్టు రూపొందింది. ఇటీవల వరల్డ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, షారుఖ్ ఖాన్ నికర ఆస్తుల విలువ $770 మిలియన్లు. ఈ నేపథ్యంలో షారుఖ్ ఖాన్, టామ్ క్రూజ్, జాకీ చాన్‌లను అధిగమించి ప్రపంచంలోని నాల్గవ అత్యంత ధనవంతుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
టాప్ ప్లేస్ దక్కించుకున్న జెర్రీ సీన్‌ఫెల్డ్, టైలర్ పెర్రీ
ఈ జాబితాలో అగ్రస్థానంలో అమెరికన్ హాస్యనటుడు జెర్రీ సీన్‌ఫెల్డ్, టైలర్ పెర్రీ నిలిచారు. ఒక్కొక్కరు $1000 మిలియన్ల నికర విలువతో టాప్ ప్లేస్ ను దక్కించుకున్నారు. వీరి తర్వాత డ్వేన్ జాన్సన్ నిలిచారు. తన నికర విలువ $800 మిలియన్లు.
బాలీవుడ్ లో ఇతర ధనిక స్టార్స్ లిస్ట్ మీకోసం..
అమితాబ్ బచ్చన్
అమితాబ్ బచ్చన్ భారతీయ సినిమా పరిశ్రమకు ఒక ఐకాన్. బిగ్ బికి మన దేశంలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. దశాబ్దాల పాటుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది. తన కెరీర్‌లో ‘షోలే’, ‘దేవర్’, ‘కూలీ’, ‘పింక్’, ‘గులాబో సీతాబో’, ‘పికు’ లాంటి బ్లాక్ బస్టర్స్ సాధించింది. పలు నివేదికల ప్రకారం ఈయన ఆస్తుల నికర విలువ 2023 నాటికి $410 మిలియన్లు.
సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ బాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు. ‘బజరంగీ భాయిజాన్’,’ ఏక్ థా టైగర్’, ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’, ‘వీర్, మైనే ప్యార్ కియా’, ‘హమ్ ఆప్కే హై కౌన్’, ‘ముజ్సే షాదీ కరోగి’ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అతడు బీయింగ్ హ్యూమన్ ఎన్జీవోని కూడా స్థాపించాడు. ఈయన నికర ఆస్తుల విలువ సుమారు $380 మిలియన్లు.
హృతిక్ రోషన్
హృతిక్ రోషన్ ‘కహో నా ప్యార్ హై’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘కోయి మిల్ గయా’, ‘కభీ ఖుషీ కభీ ఘమ్’, ‘సూపర్ 30’, ‘జిందగీ నా మిలేగీ దొబారా’ లాంటి పెద్ద హిట్స్ అందుకున్నాడు. ఈయన నికర ఆస్తుల విలువ సుమారు $370 మిలియన్లు.
Read Also: శృతి హాసన్‌కు మానసిక సమస్యలా? అదిరిపోయే జవాబిచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్యూటీ