బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కు లగ్జరీ కార్లు అంటే చాలా ఇష్టం. ఆయన గ్యారేజీలో ప్రపంచలోనే బెస్ట్ లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇందులో ఆడి, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్లకు చెందిన కార్లు ఎన్నో ఉన్నాయి. ఫాంటమ్ డ్రాప్‌ హెడ్ కూపే, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్, ఎలక్ట్రిక్ BMW i8 సహా ఉన్నాయి. అంతేకాదు, హ్యుందాయ్ శాంట్రో, క్రెటాతో పాటు టయోటా ల్యాండ్ క్రూయిజర్, మిత్సుబిషి పజెరో, BMW 6-సిరీస్ కన్వర్టిబుల్‌ లాంటి కార్లు కూడా షారుఖ్ దగ్గర ఉన్నాయి. సుమారు 15 ఏళ్ల కిందటే షారుఖ్ ఖాన్ హ్యూందాయ్ కార్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు.


షారుఖ్ గ్యారేజీలోకి ఖరీదైన రోల్స్ రాయిస్


షారుఖ్ దగ్గరున్న పలు లగ్జరీ కార్లకు తోడు మరో కారు వచ్చి చేరింది. రూ. 10 కోట్ల  విలువైన రోల్స్‌ రాయిస్‌ కల్లినన్‌ బ్లాక్‌ బ్యాడ్జ్‌ కారును కొనుగోలు చేసినట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కింగ్ ఖాన్ వెల్లడించారు. ఇది SUV కారు. కస్టమైజ్డ్ ఫీచర్స్ అన్నీ కలిపి ఆన్ రోడ్ వచ్చేసరికి ఈ కారు ఖరీదు రూ. 10 కోట్లకు పైమాటే ఉన్నట్లు తెలుస్తోంది.   తాజాగా ఈ కారుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబై వీధుల్లో తిరుగుతున్న ఈ కారును చూసి అభిమానులు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు. షారుఖ్ రేంజికి కారు ఆమాత్రం ఉండాలంటున్నారు.










‘పఠాన్’తో కనీవినీ ఎరుగని హిట్ అందుకున్న షారుఖ్


ఇక ‘పఠాన్‌' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న షారుఖ్‌ ఖాన్‌ , ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు.  షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ మూవీ అతడి కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో తెరకెక్కిన ఈ  సినిమాను, యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు.  షారుఖ్ ఖాన్ రియర్‌లోనే అత్యధిక గ్రాసర్‌ గా గుర్తింపు పొందింది. దీపికా పదుకొనె  హీరోయిన్‌గా, జాన్ అబ్రహాం విలన్ గా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది.  ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్టులోకి అడుగు పెట్టింది. ‘2.0’, ‘బాహుబలి’ సినిమాల రికార్డులను తుడిచిపెట్టింది.   


షారుఖ్ ఖాన్ అట్లీ దర్శకత్వంలో ‘జవాన్’ అనే సినిమా చేస్తున్నారు. అటు రాజ్ కుమార్ హిరానీ ‘డుంకీ’లోనే నటిస్తున్నారు.  'పఠాన్' సినిమా విడుదలకు ముందు షారుఖ్ ఖాన్ ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. 'పఠాన్' టైటిల్ నుంచి షారుఖ్ లుక్, సినిమాలోని 'బేషరమ్ రంగ్' పాటలో దీపికా పదుకోన్ ధరించిన బికినీ రంగు, సోషల్ మీడియాలో బాయ్ కాట్ పఠాన్ ట్రెండ్స్... ఒక్కటి కాదు, బోలెడన్ని సమస్యలు ఫేస్ చేశారు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమ విడుదలైన 'పఠాన్'  షారూఖ్ ఖాన్ రేంజ్ ఏంటో ప్రపంచానికి చాటా చెప్పింది. 


Read Also: టాలీవుడ్‌లో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లు అర్జున్ - మీ ప్రేమే కారణమంటూ ఫ్యాన్స్‌కు బన్నీ నోట్!