ప్రముఖ నటి సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణ శేఖర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఈ చిత్రం విడుదల అయ్యింది. దుశ్యంతుడు, శకుంతల కథ ఆధారంగా గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీతో పాటు పలు భాషల్లో విడుదల అయ్యింది.   మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడి పాత్రలో నటించారు. ఇందులో దుర్వాస మహర్షిగా కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, ప్రియంవద పాత్రలో అదితి బాలన్, అనసూయ పాత్రలో అనన్యా నాగళ్ళ నటించారు. ప్రకాష్ రాజ్, గౌతమి, జిష్షుసేన్ గుప్తా, మధుబాల, కబీర్ బేడీ, సచిన్ ఖేడేకర్, వర్షిణి తదితరులు నటించారు.    


దిల్ రాజు టీమ్ ‘Say no to PIRACY’ ప్రచారం


తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శాకుంతలం’ సినిమాపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు సినిమా బాగుంది అంటుంటే, మరికొందరు బాగాలేని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు టీమ్ ‘Say no to PIRACY’ క్యాంపెయిన్ మొదలు పెట్టింది. ఈ సినిమాను థియేటర్లలో మాత్రమే చూడాలని, పైరసీని ఎంకరేజ్ చేయకూడదని పిలుపునిచ్చింది. “3 సంవత్సరాలు మా రక్తాన్ని చెమటగా మార్చి తీసి చిత్రం ఇది. మా కష్టాన్ని గుర్తించి థియేటర్లలో మాత్రమే చూసి ఆనందించండి. విజువల్ వండర్ ను ఫీలవ్వండి. పైరసీకి నో చెప్పండి!” అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.






దిల్ రాజు ప్రచారంపై నెటిజన్ల సటైర్లు


అటు దిల్ రాజు టీమ్ చేస్తున్న‘Say no to PIRACY’ ప్రచారంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో సెటైర్లు వేస్తున్నారు. “నెగెటివ్ రివ్యూలు, వరస్ట్ ట్రైలర్, ప్రైవసీలో కూడా చూడలేరు బ్రో. ఆవేశం ఎందుకు?” అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘నీ దుకాణం సర్దేయాలి. సినిమా అస్సాం అంటగా బయట టాకు” అంటూ మరో నెటిజన్ స్పందించాడు. ‘‘HD పైరసీ వచ్చాక కూడా చూసేలా లేరు జనాలు. సో వర్రీ అవ్వాల్సిన పనిలేదు” అని మరో నెటిజన్ సటైర్ వేశారు. “నువ్ ఫ్రీ టికెట్లు ఇచ్చిన రాలేం.. నీ సినిమాకు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

































Read Also: సమంత తన భుజాలపై ‘శాకుంతలం’ మూవీని నిలబెట్టింది: ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సీరిస్ డైరెక్టర్స్ రివ్యూ