సత్యదేవ్ (Satyadev Kancharana)... తెలుగు ప్రేక్షకులకు ఆయన్ను ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. చిన్న క్యారెక్టర్లతో కెరీర్ స్టార్ట్ చేసి... ఇప్పుడు తన అభిమాన కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమాలో విలన్ రోల్ చేసే వరకూ ఎదిగారు. ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ మూమెంట్ అంటే చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోవడం! అక్టోబర్ 5న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే నెల 25న హిందీ సినిమా 'రామ్ సేతు' కూడా విడుదల అవుతోంది. అందులో సత్యేదేవ్ నటించారు. 


Satyadev On Ram Setu Movie : హిందీ చలన చిత్ర పరిశ్రమకు సత్యదేవ్ నటుడిగా పరిచయం అవుతున్న సినిమా 'రామ్ సేతు'. బాలీవుడ్ వెళ్ళడానికి తనకు ఆ సినిమా బెస్ట్ & పర్ఫెక్ట్ డెబ్యూ అని ఆయన తెలిపారు. ఆ సినిమాలో తన క్యారెక్టర్ గురించి చెప్పలేదు కానీ... అందరూ ప్రేమించే విధంగా ఆ పాత్ర ఉంటుందని, అది ఫన్ లివింగ్ రోల్ అని, సూపర్ ఉంటుందని సత్యదేవ్ పేర్కొన్నారు.


Satyadev Dubs For Ram Setu Movie : హిందీలో తన పాత్రకు సత్యదేవ్ స్వయంగా డబ్బింగ్ చెబుతున్నారు. ఇటీవల ముంబై వెళ్లి వచ్చిన ఆయన కొన్ని సన్నివేశాలకు డబ్బింగ్ పూర్తి చేశారు. స్క్రీన్ మీద ఆ సన్నివేశాలను చూసినప్పుడు బాగా అనిపించిందని, సినిమా అందరికీ నచ్చుతుందని ఆయన పేర్కొన్నారు. హిందీ కాదు... చైనీస్‌లో డైలాగులు ఇచ్చినా సరే తాను చెప్పడానికి రెడీ అని ఆయన తెలిపారు. 'రామ్ సేతు' షూటింగ్ చేసేటప్పుడు ఆ సినిమా టీమ్ అందరూ తనను బాగా చూసుకున్నారని ఆయన పేర్కొన్నారు.


Also Read : కత్తి పట్టిన బాలకృష్ణ - విదేశాల్లో ఊచకోత


'గాడ్ ఫాదర్', 'రామ్ సేతు' సినిమాల్లో కీలక పాత్రలు చేసిన సత్యదేవ్... త్వరలో సోలో హీరోగానూ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. ఈ రెండు సినిమాల కంటే ముందు కూడా ఆయన సోలో హీరోగా చేసిన సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటించిన 'గుర్తుందా శీతాకాలం', 'కృష్ణమ్మ', 'ఫుల్ బాటిల్' సినిమాల షూటింగ్స్ కంప్లీట్ అయ్యాయి. త్వరలో ఆ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 


'గుర్తుందా శీతాకాలం'లో సత్యదేవ్ సరసన తమన్నా జంటగా నటించారు. ఆ సినిమా కన్నడలో సూపర్ హిట్ అయిన 'లవ్ మాక్ టైల్' సినిమాకు తెలుగు రీమేక్. కీరవాణి తనయుడు, యువ సంగీత దర్శకుడు కాల భైరవ సంగీతం అందించారు. సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది. కాకపోతే కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. 'కృష్ణమ్మ' సినిమాకు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కన్నడ నటుడు ధనుంజయ్ తో మరో సినిమా స్టార్ట్ చేశారు. 


Also Read : 'గాడ్ ఫాదర్' క్లైమాక్స్ - చిరు, సల్మాన్ ఫ్యాన్స్‌కు ట్రీట్ - ఎక్స్‌క్లూజివ్ న్యూస్ ఏంటంటే?