కోనసీమ, గోదావరి నేపథ్యంలో చాలా తెలుగు చిత్రాలు వచ్చాయి. అందులో కుటుంబ కథలు, ప్రేమ కథలు ఉన్నాయి. అలాగే, యాక్షన్ చిత్రాలూ కొన్ని ఉన్నాయి. 'శశివదనే' (Sasivadane Movie) కూడా గోదావరి నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమే. అయితే... తమది గోదావరి నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఇది తొలి యాక్షన్ అండ్ లవ్ డ్రామా అని నిర్మాత అహితేజ బెల్లంకొండ అంటున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యింది.

  
  
రక్షిత్ అట్లూరి (Rakshit Atluri) కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'శశివదనే'. ఇందులో కోమలీ ప్రసాద్ (Komali Prasad) కథానాయిక. శ్రీమతి గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మూడు రోజుల ప్యాచ్ వర్క్ మినహా సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యిందని చిత్ర బృందం వెల్లడించింది.


కోనసీమలో... 50 రోజుల్లో!
'శశివదనే' షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన సందర్భంగా చిత్ర నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ... ''కోనసీమ, అమలాపురంలోని అందమైన లొకేషన్లలో 50 రోజుల పాటు షూటింగ్ చేశాం. ఈ 50 రోజుల్లో మాకు ఎన్నో అందమైన జ్ఞాపకాలను అందించిన కోనసీమకు థాంక్స్. విజువల్ పరంగా 'శశివదనే' చాలా  బావుంటుంది. కోనసీమ అందాలను మా దర్శకుడు, ఛాయాగ్రాహకుడు చక్కగా కెమెరా కంటితో బంధించారు. కథ పరంగా, సాంకేతిక పరంగా ఉన్నత ప్రమాణాలతో, నిర్మాణ విలువలతో సినిమా తీశాం. 'పలాస 1978' సినిమాతో యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి ప్రేక్షకులను మెప్పించారు. మా 'శశివదనే'తో మరింత ఆకట్టుకున్నారు. ఇందులో ఆయన చక్కని నటనను కనపరచారు. హీరోయిన్ కోమలీ ప్రసాద్ అభినయం, ఆహార్యం చాలా అందంగా ఉంటాయి. సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. ఐదూ చాలా అద్భుతంగా వచ్చాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశాం. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని... ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకు రావాలని అనుకుంటున్నాం. ఈ సినిమా ప్రతి ఒక్కరికి కచ్చితంగా నచ్చుతుంది'' అని అన్నారు.  


Also Read : ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫిక్షనల్ - మహేష్ బాబు రియల్



ప్రాంతీయతకు ప్రాముఖ్యం ఇస్తూ... రూపొందిస్తున్న యాక్షన్ చిత్రాలకు ఈ మధ్య ఆదరణ బావుంటోంది. భాషతో సంబంధం లేకుండా కథ, కథనాలు, నటీనటుల అభినయం బావుంటే ప్రేక్షకులు సినిమాలు చూస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణ 'కాంతార'. గోదావరి నేపథ్యంలో వస్తున్న 'శశివదనే' చిత్రానికీ మంచి ఆదరణ లభించే అవకాశాలు ఉన్నాయి. 


'శశివదనే' సినిమాలో సంగీత దర్శకుడు - నటుడిగా మారిన రఘు కుంచె, తమిళ నటుడు శ్రీమాన్, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, 'రంగస్థలం' మహేష్ (ఆచంట) , ప్రవీణ్ యండమూరి, 'జబర్దస్త్' బాబీప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఎడిటర్ : గ్యారీ బీహెచ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీపాల్ చొల్లేటి, ఛాయాగ్రహణం : సాయికుమార్ దార, సాహిత్యం : కిట్టూ విస్సాప్రగడ, కరుణాకర్ అడిగర్ల, సంగీతం : శరవణ వాసుదేవన్.