Sasivadane First Single : కోమలితో రక్షిత్ రొమాన్స్ - ఆమె వెనుకే అతడి అడుగు 

రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా నటిస్తున్న 'శశివదనే' టైటిల్ సాంగ్ ప్రోమో విడుదలైంది. ఫుల్ సాంగ్ ఎప్పుడు విడుదల చేసేదీ ఈ రోజు వెల్లడించారు. 

Continues below advertisement

రక్షిత్ అట్లూరి (Rakshit Atluri) కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'శశివదనే' (Sasivadane Movie). ఇందులో కోమలీ ప్రసాద్ (Komali Prasad) కథానాయిక. శ్రీమతి గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ రోజు సినిమా టైటిల్ సాంగ్ ప్రోమో విడుదల చేశారు.  

Continues below advertisement

శశివదనే... నువ్వుంటే చాలుగా!
అందమైన గోదావరి... అందులో ఓ ఇల్లు... ఉదయాన్నే తులసి కోట దగ్గర దీపం వెలిగించిన అమ్మాయి... దణ్ణం పెడుతున్న సమయంలో ఓ సౌండ్... అబ్బాయి వచ్చాడని అమ్మాయికి అర్థమైంది. వెంటనే అతడి చూడటానికి అమ్మాయి ఇంట్లో మెట్లు ఎక్కింది. వెనుక నేపథ్యంలో శ్రావ్యమైన సాంగ్ వినబడింది.

''శశివదనే శశివదనే... నువ్వుంటే చాలుగా!
నీ వెనుకే... నా అడుగే!  నీ సగమే నేనుగా!'' 
అంటూ లిరిక్స్ సాగాయి. 

'శశివదనే' సినిమాకు శరవణ వాసుదేవన్ సంగీతం అందించారు. మణిరత్నం దర్శకత్వం వహించిన 'ఇద్దరు' సినిమాలో 'శశివదనే' పాట సూపర్ హిట్. ఆ టైటిల్‌తో వస్తున్న చిత్రమిది. సాంగ్ ప్రోమో చూస్తుంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఫుల్ సాంగ్ ఫిబ్రవరి 1న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన హీరో హీరోయిన్ల స్టిల్ బావుంది.  

'శశివదనే' సినిమాలో పాటకు కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం అందించారు. హరి చరణ్, చిన్మయి శ్రీపాద ఆలపించారు. ప్రోమోలో చిన్మయి వాయిస్ వినిపించలేదు. పాటలో ఆమె వాయిస్ వినాలని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.

Also Read : రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్టీఆర్ - ఏం చేస్తున్నారంటే?
     

కోనసీమ, గోదావరి నేపథ్యంలో తెలుగులో చాలా చిత్రాలు వచ్చాయి. కుటుంబ కథలు కొన్ని, ప్రేమ కథలు ఇంకొన్ని... కోనసీమ నేపథ్యంలో చాలా సినిమాలు ఉన్నాయి. అలాగే, యాక్షన్ చిత్రాలూ ఉన్నాయి. 'శశివదనే' (Sasivadane Movie) గోదావరి నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమే. అయితే... ''గోదావరి నేపథ్యంలో తెరకెక్కిస్తున్న తొలి యాక్షన్ అండ్ లవ్ డ్రామా ఇది'' అని నిర్మాత అహితేజ బెల్లంకొండ అంటున్నారు. కోనసీమలో 50 రోజుల పాటు సినిమా షూటింగ్ చేశారు. సినిమాలో రక్షిత్ శెట్టి అద్భుతంగా నటించాడని చెప్పారు. కోమలి ప్రసాద్ అందంతో పాటు అభినయానికి ఆస్కారం ఉన్న పాత్ర చేశారని తెలిపారు. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తామని చెప్పారు. 

Also Read : రెండు పార్టులు పవన్ 'అన్‌స్టాపబుల్‌ 2' సందడి - ఫస్ట్ పార్ట్ ఎప్పుడంటే? 

ప్రాంతీయతకు ప్రాముఖ్యం ఇస్తూ... రూపొందిస్తున్న యాక్షన్ చిత్రాలకు ఈ మధ్య ఆదరణ బావుంటోంది. భాషతో సంబంధం లేకుండా కథ, కథనాలు, నటీనటుల అభినయం బావుంటే ప్రేక్షకులు సినిమాలు చూస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణ 'కాంతార'. గోదావరి నేపథ్యంలో వస్తున్న 'శశివదనే' చిత్రానికీ మంచి ఆదరణ లభించే అవకాశాలు ఉన్నాయి.  

'శశివదనే' సినిమాలో సంగీత దర్శకుడు - నటుడిగా మారిన రఘు కుంచె, తమిళ నటుడు శ్రీమాన్, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, 'రంగస్థలం' మహేష్ (ఆచంట) , ప్రవీణ్ యండమూరి, 'జబర్దస్త్' బాబీప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఎడిటర్ : గ్యారీ బీహెచ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీపాల్ చొల్లేటి, ఛాయాగ్రహణం : సాయికుమార్ దార, సాహిత్యం : కిట్టూ విస్సాప్రగడ, కరుణాకర్ అడిగర్ల, సంగీతం : శరవణ వాసుదేవన్. 

Continues below advertisement
Sponsored Links by Taboola