Mahesh Babu SVP Song Leaked: మహేష్ సిగ్నేచర్ స్టెప్ అదిరిందంటున్న ఫ్యాన్స్, 'కళావతి' సాంగ్ లీక్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా 'సర్కారు వారి పాట'. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలనుకున్న సాంగ్ లీకైంది. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Continues below advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'సర్కారు వారి పాట'. బ్లాక్ బస్టర్ హిట్ 'గీత గోవిందం' తర్వాత పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో కీర్తీ సురేష్ కథానాయిక. ఈ సినిమాలో తొలి పాట 'కళావతి...'ని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ రిలీజైన సాంగ్ ప్రోమో యూట్యూబ్‌లో నంబర్ వన్ పొజిష‌న్‌లో ట్రెండ్ అవుతోంది. ఐదు మిలియన్ వ్యూస్ వచ్చాయి. పాట కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో 'సర్కారు వారి పాట' చిత్ర బృందానికి లీకురారుళ్లు షాక్ ఇచ్చారు.

Continues below advertisement

'కళావతి...' లిరికల్ వీడియో ఈ రోజు (శనివారం) సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. మొత్తం నాలుగు నిమిషాల పాటను కొంత మంది యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తుంటే... మరికొంత మంది వాట్సాప్ గ్రూప్స్‌లో సర్క్యులేట్ చేస్తున్నారు. ఆల్రెడీ రిలీజైన ప్రోమో చూస్తే... మహేష్ బాబు చాలా హ్యాండ్స‌మ్‌గా ఉన్నారు. లిరికల్ వీడియోలో హైలైట్ ఏంటంటే ఆయన వేసిన స్టెప్. ఇంకా చెప్పాలంటే... హీరోయిన్ కీర్తీ సురేష్ చీర కుచ్చిళ్ళు సరిచేస్తూ ఉన్న స్టిల్ ఒకటి ఉంది. ఇవన్నీ సూపర్ అని ఆల్రెడీ సాంగ్ చూసినవాళ్లు చెబుతున్నారు.

ఒకటి రెండు ఇంగ్లిష్ పదాలు మినహా... అచ్చమైన తెలుగులో అనంత శ్రీరామ్ పాట రాశారు. 'ఇట్టాంటివన్నీ అలవాటే లేదే... అట్టాంటి నాకు ఈ తడబాటు ఎందే' అంటూ సాగిన ఈ గీతాన్ని సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.  మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మే 12న థియేటర్లలో సినిమా విడుదల కానుంది. 

Continues below advertisement
Sponsored Links by Taboola