కార్తి, రాశీఖన్నా హీరో, హీరోయిన్లుగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘సర్దార్’. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. అన్న పూర్ణ స్టూడి యోస్ ఈ సినిమాని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. రజిషా విజయన్, చుంకీ, లైలా, ముని ష్కాంత్, అశ్విన్, యోగ్ జాపి, నిమ్మి, బాలాజీ శక్తి వేల్, ఎలవరసు సహా పలువురు నటీనటుల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటివలే విడుదలైన 'సర్దార్' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. సినిమాపై ఆడియెన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది నిర్మాణ సంస్థ. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
Read Also: బాలీవుడ్ లోకి టీమిండియా గబ్బర్ సింగ్ ఎంట్రీ, హ్యూమాతో శిఖర్ డ్యాన్స్!
ఆరు గెటప్స్ లో అలరించనున్న కార్తి!
ఇక ‘సర్దార్’ సినిమాలో మొత్తం ఆరు గెటప్స్ లో కార్తి కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘సేనాపతి నేనే’ అనే పాటను విడుదల చేశారు. జీవీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ అదిరిపోయింది. జానపద పాటగా దీన్ని రూపొందించారు. అనురాగ్ కులకర్ణి అద్భుతంగా పాడారు. చంద్ర బోస్ చక్కటి సాహిత్యం అందించారు. ఈ పాటలో కార్తి పులి వేషంలో కనిపించి ఆకట్టుకున్నారు. మరోవైపు ఈ సినిమా రన్ టైమ్ మొత్తం 2 గంటల 46 నిముషాలుగా మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ మధ్య కాలంలో వస్తున్న లాంగ్ రన్ టైమ్ సినిమా ‘సర్దార్’ నిలవబోతుంది.
తెలుగులో మంచి ఫాలోయింగ్!
తమిళ స్టార్ హీరోగా కొనసాగుతున్న కార్తి, తెలుగు ప్రేక్షకు బాగానే పరిచయం అయ్యారు. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులో డబ్బై మంచి సక్సెస్ అందుకున్నాయి. యముగానికొక్కడే, ఆవారా, నా పేరు శివ, ఖాకీ, ఖైదీ లాంటి సినిమాలు తెలుగు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. అటు నాగార్జున హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ‘ఊపిరి’ సినిమాతో నేరుగా తెలుగులో నటించారు. చక్కటి నటనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాతో బిజీగా గడుపుతున్నాడు కార్తి. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాతో కార్తి నటించాడు. తాజాగా ఈ సినిమా విడుదలై తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా రెండో భాగం 2023లో విడుదల కానుంది.
Read Also: ప్రతిష్టాత్మక మార్వెల్ మూవీస్ విడుదల ఆలస్యం, కారణాలు ఏంటో తెలుసా?