Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘యానిమల్’. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పటికే ఈ మూవీ రూ. 850 కోట్లు వసూళు చేసింది.  ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమాలో అనిల్ కపూర్, త్రిప్తి దిమ్రి, శక్తి కపూర్ సహా పలువు కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ ఈ చిత్రంలో విలన్ గా నటించి మెప్పించారు. ఆయన ఈ చిత్రంలో కనిపించింది కొద్ది సేపు అయినా, అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. క్లైమాక్స్ లో రణబీర్, బాబీ డియోల్ మధ్యన వచ్చే ఫైట్ సీన్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఇద్దరూ అన్నదమ్ములుగా కనిపిస్తారు.


రణబీర్, బాబీ డియోల్ కిస్ సీన్ తొలగింపు


ఇక ‘యానిమల్’ సినిమాలో బాబీ డియోల్, రణబీర్ మధ్యలో ఓ కిస్ సీన్ ఉంటుంది. కొట్లాడ్డం కంటే కలిసి పోవడం మంచిది అంటూ రణబీర్ ను బాబీ ముద్దు పెట్టుకుంటాడు. అయితే, ఈ సీన్ ను తొలగించినట్లు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెలిపారు. ఈ సీన్ ను ఎందుకు తొలగించాల్సి వచ్చింది అనే విషయాన్ని తాజాగా వెల్లడించారు. బాబీ డియోల్, రణబీర్ కపూర్ చెంపపై ముద్దుపెట్టి, “భాయ్, నేను మా నాన్నతో ఒక్కరోజు కూడా గడపలేదు” అని చెప్తాడు. ఈ సీన్ షూటింగ్ లో బాగానే అనిపించినా, ఎడిటింగ్ సమయంలో రణబీర్ పగలో డెప్త్ ను తగ్గించేలా ఉందని భావించి తొలగించినట్లు చెప్పుకొచ్చారు.    


ఓటీటీలో అన్ కట్ వెర్షన్?


థియేట్రికల్ విడుదలలో ఈ సీన్ తొలగించినా, ఓటీటీలో ఈ సీన్ ఉండవచ్చని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెలిపారు. ఒకవేళ ఓటీటీలో అన్ కట్ వెర్షన్ వస్తే అప్పుడా సీన్ ని ఎంజాయ్ చేయొచ్చని ఇప్పటికే నటుడు బాబీ డియోల్ తెలిపారు. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ ఇండియాలో అందుబాటులోకి రానుంది. ఈ చిత్రం థియేట్రికల్ విడుదలైన సుమారు 6 నుంచి 8 వారాల తర్వాత స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉంది. అయితే, రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ మూవీ రన్ టైమ్ 3 గంటల 21 నిమిషాలు ఉంది. అయితే, డిజిటల్ వెర్షన్ డ్యూరేషన్ మరో 30 నిమిషాల పాటు పొడగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  


‘యానిమల్’ మూవీ గురించి..


సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రి ప్రధాన పాత్రల్లో నటించారు. తండ్రీ కొడుకుల మధ్య సెంటిమెంట్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 1న విడుదల అయ్యింది. 


Read Also: కథ వినకుండానే నో చెప్పాడు, విజయ్ దళపతిపై దర్శకుడు లింగుస్వామి షాకింగ్ కామెంట్స్