తెలుగులో 'రాజావారు రాణి గారు', 'ఎస్ ఆర్ కళ్యాణ మండపం' వంటి సినిమాల్లో హీరో నటించారు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు 'సమ్మతమే' అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. గతంలోనే ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా.. దానికి మంచి రెస్పాన్సే వచ్చింది.
రీసెంట్ గా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. జూన్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. మూడు నిమిషాల ఈ ట్రైలర్ ను బట్టి ఇదొక యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. చిన్నప్పటినుంచి పెళ్లినే ధ్యేయంగా చేసుకున్న ఓ యువకుడు ఫైనల్ గా ఇంట్లో వాళ్లు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.
కానీ ఆ అమ్మాయితో ట్రావెల్ చేసే సమయంలో తనకు మందు, సిగరెట్లు ఇలా కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయని తెలుసుకుంటాడు. ఆమెకి అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉండడం కూడా తట్టుకోలేకపోతాడు. ఈ క్రమంలో అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు..? చివరికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా..? అనేదే ఈ సినిమా కథ. ఇవే పాయింట్స్ ను ట్రైలర్ లో చూపించారు. హీరోతో బూతులు పలికించిన డైరెక్టర్, లిప్ లాక్ సీన్స్ కూడా చూపించారు.
ఈ సినిమాలో కిరణ్ కు జోడీగా తెలుగమ్మాయి చాందిని చౌదరి నటిస్తోంది. యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కె.ప్రవీణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.
Also Read: కశ్మీర్ లో పండిట్స్ ను చంపారు, ఇక్కడ ముస్లింను కొట్టారు - సాయిపల్లవి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్!