Samantha Next Item Song: 'లైగర్' సినిమాలో సమంత ఐటెం సాంగ్.. నిజమెంత..?

సమంత మరో సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Continues below advertisement
స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యకాలంలో వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఇటీవల విడుదలైన 'పుష్ప' సినిమాలో ఆమె ఐటెం సాంగ్ లో కనిపించింది. 'ఊ అంటావా మావా' అంటూ సాగే ఈ పాటలో సమంత గ్లామర్ షోకి, స్టెప్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. నేషనల్ లెవెల్ లో ఈ పాట వైరల్ అయింది. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సాధించింది. 
 
ఇదిలా ఉండగా.. ఇప్పుడు సమంత మరో సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు పూరి జగన్నాధ్ రూపొందిస్తోన్న 'లైగర్' సినిమాలో స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేస్తున్నారు. దీనికోసం సమంతను సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ తో సమంతకు ఉన్న చనువుతో ఆమెని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. 
 
దీనిపై ఎలాంటి అధికార సమాచారం లేదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సమంత మరో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ లేదని ఆమె సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. వరుసగా ఐటెం సాంగ్స్ చేయడం తన కెరీర్ పై ఎంతవరకు ప్రభావం చూపుతుందో చెప్పలేం. అందుకే ఇప్పట్లో సామ్ స్పెషల్ సాంగ్స్ చేయదని అంటున్నారు. 
 
పైగా ఆమె చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. ముందు వాటిని పూర్తి చేయాల్సివుంది. అలా చూసుకుంటే విజయ్ తో స్టెప్పులేసే అవకాశమే లేదు. 'పుష్ప'లో కూడా ఐటెం సాంగ్ చేయడానికి కారణం దర్శకుడు సుకుమార్ అనే చెప్పాలి. ఆమెకి 'రంగస్థలం' లాంటి హిట్ ఇచ్చారు సుకుమార్. అతడిపై ఉన్న గౌరవంతోనే సాంగ్ లో నటించింది. ఇప్పుడు పూరి సినిమాలో ఐటెం సాంగ్ అంటే ఆమె ఒప్పుకోకపోవచ్చు. 
 

 
 
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Continues below advertisement
Sponsored Links by Taboola