టాలీవుడ్ స్టార్ దర్శకుడు తెరకెక్కించిన సినిమా ‘శాకుంతలం’. ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్ర పోషించింది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, నీలిమ గుణ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 14 న తెలుగు, హిందీ,తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదల అయిన మూవీ టీజర్ కు విశేషమైన ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా తిరుగుతోంది. తాజాగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సమంత ‘శాకుంతలం’ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేసి తాను షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న ఐదు సవాళ్ల గురించి చెప్పుకొచ్చింది.
‘శాకుంతలం’ సినిమాలో సమంత శకుంతల పాత్రలో కనిపించింది. ఈ పాత్ర కోసం షూటింగ్ లో రకరకాల పువ్వులను ఆమెకు అలంకరించారట. అయితే తనకు నిజంగా పవ్వులు అంటే ఎలర్జీ అని కానీ సినిమాలో కొన్ని సన్నివేశాల కోసం చేతికి కట్టుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. మొదట్లో బానే ఉన్నా తర్వాత ఆ మచ్చలు అలాగే ఉండిపోయాయని, కొన్నాళ్లా వరకూ ఆ మచ్చలు అలాగే ఉండిపోయాయని దీంతో చాలా రోజులు ఇబ్బంది పడ్డానని చెప్పింది. ఆ మచ్చలను కవర్ చేయడానికి ఆ ప్లేస్ లో మేకప్ వేయాల్సి వచ్చేదని చెప్పింది. అలాగే ఈ సినిమా కోసం మూడు భాషల్లో తానే డబ్బింగ్ చెప్పుకోవాల్సి వచ్చిందని, అప్పుడు కొంచెం కష్టంగా అనిపించిందని తెలిపింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తానే డబ్బింగ్ చెప్పిదట సమంత. అంతే కాదు సినిమా షూటింగ్ లో కూడా కొన్ని ఇబ్బందికర సందర్భాలను ఎదుర్కొందట. సెట్స్ లో ఉండగా ఓ కుందేలు తనను కరిచేసిందని చెప్పుకొచ్చింది.
అలాగే సినిమాలోని కాస్ట్యూమ్స్ విషయంలో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయట సమంతకు. సినిమాలో ఓ కోసం ఏకంగా 30 కేజీలు ఉన్న లెహంగను వేసుకోవాల్సి వచ్చిందట. అయితే ఆ పాటలో ఆ లెహంగతో రౌండ్ గా తిరిగే సీన్ చేయాల్సి వచ్చిందని. దీంతో తాను ఫ్రేమ్ లో నుంచి బయటకు వెళ్లిపోయేదాన్ని అని, డాన్స్ మాస్టర్ ఏంటీ ఫ్రేమ్ నుంచి వెళ్లిపోతున్నారు అని అడిగితే.. నేనెక్కడ వెళ్తున్నాను డ్రెస్ లాక్కెళ్లి పోతుంది అని చెప్పానని ఫన్నీ ఫ్యాక్ట్ ను చెప్పింది. అలాగే సినిమాలో చూపించిన తన హెయిర్ కూడా ఒరిజినల్ కాదని, సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, ట్రైలర్ చూస్తే అది రియల్ జుట్టు కాదు అని నమ్మలేం అని పేర్కొంది. ఇలా తను నటించిన ‘శాకుంతలం’ సినిమా గురించి ఎవరికీ తెలియని ఫ్యాక్ట్స్ ను అభిమానులతో పంచుకుంది సమంత. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ‘శాకుంతలం’ సినిమా ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : అనుపమలో ఇంత టాలెంట్ ఉందా? షార్ట్ ఫిల్మ్‌కు సినిమాటోగ్రఫీ