KA Paul Comments: ఎన్నికల(Elections) సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీల నేతలు రెడీ అయిపోతున్నారు. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ.. తమదైన స్టైల్ లో ప్రచారాలు చేసుకుంటున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే ఊపులో ఉన్నారు ప్రజాశాంతి పార్టీ(Prajasanthi Party) అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul ). ఈయన కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే అటు వైఎస్‌ఆర్‌సీపీ(YSRCP), ఇటు బీఆర్ఎస్(BRS Party) ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అయితే తాజాగా ఆయన చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కేఏ పాల్ ఏం మాట్లాడినా కామెడీగానే ఉంటుంది చాలా మందికి. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాలను తాను మాత్రమే మార్చగలనని చెప్పుకొచ్చారు. అలాగే హిట్లర్ చనిపోయిన రోజున సచివాలయం ఎలా ప్రారంభిస్తారని... తెలంగాణ(Telangana) తాజా రాజకీయాలపై స్పందించారు. తనకు ఇష్టం లేకపోవడం వల్లే దేవుడు అక్కడ అగ్ని ప్రమాదం సృష్టించాడని కూడా చెప్పాడు.
"కేసులు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయని ప్రజాశాంతీ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. సుప్రీంకోర్టులో కేసు అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో పాల్ మాట్లాడారు. తాను ఓడిపోలేదని, పోరాటం కొనసాగిస్తానని అన్నారు. ట్రంప్ అరెస్ట్ అవుతారని తాను గతంలోనే చెప్పాని గుర్తు చేశారు. తనపై సిరిసిల్లలో దాడి చేసిన వారిని ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేయలేదని అన్నారు. అనిల్ కుమార్ తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. అంబేడ్కర్ జన్మదినమైన ఏప్రిల్ 14వ తేదీన అంబేడ్కర్ విగ్రహం, సచివాలయం ప్రారంభించాలని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ను డిమాండ్ చేశారు. హిట్లర్ చనిపోయిన ఏప్రిల్ 30వ తేదీన సచివాలయాన్ని ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు రాష్ట్రంలో తాను చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. లేనిపోని కేసులు బనాయించి ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. తనను చంపేందుకు చాలా కుట్ర జరుగుతోందన్నారు." ఇదంతా రాసి ఉన్న తెలుగు, ఇంగ్లీషు కాపీలను కేఏ పాల్ షేరే చేస్తూ... రీడ్, థింక్ అండ్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు.