టి కాజల్ అగర్వాల్ గర్భంపై కొందరు దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. బాగా లావయ్యావంటూ ఆమెను బాడీ షేమింగ్ చేస్తున్నారు. దీంతో కాజల్ మౌనంగా ఉండలేకపోయింది. తనని ట్రోల్ చేస్తున్న నెటిజనులకు ఇచ్చి పడేసింది. అయితే, కోపంతో కాకుండా.. మహిళలపై గౌరవం కలిగేంత చక్కగా సమాధానం ఇచ్చింది. గర్భధారణ సమయంలో మహిళల్లో వచ్చే మార్పులను వివరిస్తూ మూర్ఖుల కళ్లు తెరిపించింది. కాజల్ చేసిన ఈ పోస్టుకు ఇప్పుడు యావత్ మహిళాలోకం మద్దతు తెలుపుతున్నారు. కాజల్ సోదరి నిషా అగర్వాల్‌‌తోపాటు నటి సమంత, మంచు లక్ష్మీ, రాశీ ఖాన్న సైతం స్పందించారు. 


ఇటీవల కాజల్ తన చెల్లెలు నిషా అగర్వాల్ కుమారుడితో ఓ ప్రకటనలో నటించింది. బేబీ బంప్‌తో ఉన్న ఆమెను చూసి కొంతమంది నెటిజనులు హేళన చేశారు. వారి కామెంట్లు బాధ కలిగించాయో ఏమిటో.. సోషల్ మీడియా వేదికగా తన మనసులో మాటను చెప్పేసింది. 


‘‘నా జీవితంలో, నా శరీరంలో, నా ఇంటిలో... ముఖ్యంగా వృత్తిపరమైన జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మార్పులతో ముందుకు వెళ్తున్నాను. ఈ సమయంలో కామెంట్లు, బాడీ షేమింగ్ మెసేజ్‌లు, మీమ్‌లు నాకు  నిజంగా సహాయం చేయవు. అందరం దయతో ఉండడం నేర్చుకుందాం. ఇతరుల పట్ల దయతో ఉండటం కష్టం అయితే... మీరు జీవించండి. ఇతరుల్ని జీవించనివ్వండి. గర్భవతులు పరిస్థితి గురించి విమర్శలు చేసేవాళ్లు మూర్ఖులు. జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న మహిళలకు, ముఖ్యంగా అర్థం చేసుకోలేని మూర్ఖులు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. గర్భధారణ సమయంలో మనం బరువు పెరుగుతాం. మనలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. హార్మోన్ల మార్పులు ఉంటాయి. కడుపులో బిడ్డ పెరిగే కొద్దీ పొట్ట పెద్దది అవుతుంది. శిశువుకు తగినట్టుగా శరీరం సిద్ధమవుతుంది. కొందరికి శరీరం పెద్దదైన చోట స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడవచ్చు. కొన్నిసార్లు చర్మం చిట్లవచ్చు’’ అంటూ గర్బిణీలు ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులను వివరించింది.


కాజల్ పోస్ట్‌పై సమంతా కూడా స్పందించింది. అయితే, కాజల్‌ను కూల్ చేస్తూ.. ‘‘నువ్వు ఎప్పుడూ అందంగానే ఉంటావ్’’ అని తెలిపింది. హన్సిక స్పందిస్తూ.. ‘‘నువ్వు అద్భుతంగా ఉంటావు కాజ్. ఏ కామెంట్లు దాన్ని మార్చలేవు. నువ్వే కాదు, నీ మనసు కూడా అందమైనదే’’ అని తెలిపింది. మంచు లక్ష్మి స్పందిస్తూ.. ‘‘ఎటు నుంచి చూసినా నువ్వు పర్‌ఫెక్ట్‌గా ఉంటావు. నీ చుట్టూ చాలా ప్రేమ ఉంది. హేటర్స్ ఎప్పుడూ హేటర్స్‌లాగేనే ఉంటారనేది గుర్తుంచుకో’’ అని పేర్కొంది. ప్రస్తుతం కాజల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also Read: కాజల్‌కు కోపం వచ్చింది... తన గర్భంపై వస్తున్న ట్రోల్స్‌కు దిమ్మతిరిగే సమాధానం!