Samantha Compliments On Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి తాజాగా ‘రా మచ్చా మచ్చా’ పాటను విడుదల చేశారు. ఈ పాటలో రామ్ చరణ్ డ్యాన్స్ చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మాస్ స్టెప్పులతో ఆయన చేసి డ్యాన్స్ అభిమానులలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. రామ్ చరణ్ హెలికాఫ్టర్ నుంచి దిగే సీన్ నుంచి చివరి షాట్ వరకు ప్రేక్షకులను అబ్బుర పరిచారు. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య స్టెప్స్ వారెవ్వా అనిపించాయి. రామ్ చరణ్ గ్రేస్ ఊపు తెచ్చింది. చిరంజీవి కటౌట్ ముందుకు రామ్ చరణ్ వీణ స్టెప్స్ వేసి అడియన్స్‌లో జోష్ నింపారు.
రామ్ చరణ్ డ్యాన్స్ మీద సమంత ప్రశంసలు
‘రా మచ్చా మచ్చా’ పాటకు సమంత ఫిదా అయ్యారు. చెర్రీ ఫుట్ ట్యాపింగ్ డ్యాన్స్ అన్ మ్యాచబుల్ అంటూ ప్రంశసించింది. రామ్ చరణ్ షేర్ చేసిన ఈ సాంగ్ కు ఆయన సతీమణి ఉపాసన కామెంట్ పెట్టింది. ‘‘మిస్టర్ చరణ్ నువ్వు హై ఓల్టేజ్ ఎలక్ట్రిసిటీని జెనరేట్ చేశావ్” అని రాసుకు వచ్చింది. ఈ కామెంట్ కు సమంత రిప్లై ఇచ్చింది. ‘అన్ మ్యాచబుల్’ అని కామెంట్ పెట్టింది. ఫార్మల్ షర్ట్, ప్యాంట్ లో మరెవ్వరూ ఆయనలా డ్యాన్స్ చేయలేరు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమన్ కంపోజ్ చేసిన ఈ పాట చెర్రీ అభిమానులను అలరిస్తోంది.
డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు ‘గేమ్ ఛేంజర్’
Game Changer Release Date: స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న 'గేమ్ ఛేంజక్' సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ‘దేవర’ కోసం చూశారు ప్రేక్షకులు. ఆ సినిమా విడుదల కావడంతో ఇప్పుడు అందరి దృష్టి చెర్రీ మూవీ మీద పడింది. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. లేదంటే డిసెంబర్ 25న విడుదల కావచ్చు. క్రిస్మస్ బరిలో సినిమా విడుదల కావడం కన్ఫర్మ్. 'దిల్' రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు కథను అందించారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, జయరామ్, నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్ తో పాటు పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read Also: ముందుకొచ్చిన 'మ్యాడ్ స్క్వేర్'... ఎన్టీఆర్ బావమరిది సినిమా క్రిస్మస్ బరిలో కాదు!