టాలీవుడ్ స్టార్ హీరోయిన సమంత ఇటీవల కేరళ ట్రిప్ కి వెళ్లింది. తన స్నేహితురాలు మేఘనతో కలిసి అక్కడే చిల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. తన అభిమానులతో కాసేపు ఇన్స్టాగ్రామ్ లో ముచ్చటించింది సామ్. ఈ క్రమంలో వారు అడిగిన ప్రశ్నలను సమాధానాలు చెప్పుకొచ్చింది. రీసెంట్ గా సమంత 'బీస్ట్' సినిమాలోని 'అరబిక్ కుతు' పాటకు ఎయిర్ పోర్ట్ లో స్టెప్పులేస్తూ కనిపించింది. 


ఆ వీడియోను అభిమానులతో పంచుకుంది. యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోన్న ఈ పాటకి చాలా మంది అభిమానులు డాన్స్ చేస్తున్నారు. సమంత కూడా డాన్స్ చేయడంతో ఆ వీడియో వైరల్ అయింది. దీంతో ఓ నెటిజన్ 'ముందుగానే ప్లాన్ చేసుకొని చేశారా..? లేదా సడెన్ గా డాన్స్ చేశారా..?' అని ప్రశ్నించగా.. 'ఎయిర్ పోర్ట్ కి వచ్చే సమయంలో అనిరుధ్ చేసి రీల్ చూశాను. నాకు కూడా డాన్స్ చేయాలనిపించి.. సడెన్ గా చేశాను. ప్లాన్ చేసి చేయలేదని' చెప్పుకొచ్చింది. 


మరో నెటిజన్ 'మీరెవరినైనా రీప్రొడ్యూస్ చేశారా..? నేను మీతో రీప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నా..' అంటూ తప్పుడు అర్ధం వచ్చేలా ప్రశ్నించగా.. దానికి సమంత 'రీప్రొడ్యూస్ అనే పదాన్ని ఒక సెంటెన్స్ లో ఎలా వాడాలో ముందు గూగుల్ చేసి తెలుసుకో..' అంటూ ఘాటుగా బదులిచ్చింది సమంత. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'శాకుంతలం' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలానే 'యశోద' అనే సినిమా సెట్స్ పై ఉంది. దీంతో పాటు ఓ బైలింగ్యువల్ సినిమా, ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఓకే చేసింది.