Salman Khan: షారుఖ్ నివసిస్తున్న ఇంటిని ముందు నేనే కొనాలనుకున్నా, ఆ కారణంతోనే కొనలేదు: స‌ల్మాన్ ఖాన్

Salman Khan: ముంబైలో షారుక్ ఖాన్ ఇల్లు చాలా ప్ర‌త్యేకంగా ఉంటుంది. ముంబై వ‌చ్చిన షారుక్ అభిమానులు క‌చ్చితంగా ఆ ఇంటిని చూస్తారు. అయితే, ఆ ఇంటిపై స‌ల్మాన్ ఖాన్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.

Continues below advertisement

Salman Khan Says SRK's Mannat Was 1st Offered To Him : బాలీవుడ్ న‌టుడు షారుక్ ఖాన్ ఇల్లు ముంబైలో ఒక టూరిస్ట్ స్పాట్ అనే చెప్పాలి. కార‌ణం.. వంద‌లాది మంది అభిమానులు ఆయ‌న ఇంటిని చూసేందుకు వ‌స్తారు. త‌మ అభిమాన హీరో క‌నిపిస్తాడేమో అనే ఉద్దేశంతో ఎదురు చూస్తుంటారు. షారుఖ్ ఇంటి పేరు 'మ‌న్న‌త్'. అయితే, అంత పెద్ద ఇంటిని ముందు త‌ను కొనాల‌ని చూశాడ‌ట స‌ల్మాన్ ఖాన్ కానీ, త‌న తండ్రి ఆపాడ‌ని చెప్పుకొచ్చాడు. గ‌తంలో ఈ విష‌యాన్ని ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పారు స‌ల్మాన్ ఖాన్.

Continues below advertisement

మా నాన్న ఆపేశాడు.. 

గ‌తంలో ఒక ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు స‌ల్మాన్ ఖాన్. దాంట్లో హోస్ట్ “షారుక్ ఖాన్ కి ఉన్న‌వాటిల్లో మీకు కూడా ఉంటే బాగుండు అని అనిపించిన విష‌యం ఏంటి?” అని అడిగితే.. “ఆయ‌న‌కున్న బంగ్లా”. అని చెప్ప‌గానే ఆశ్చ‌ర్య‌పోయిన హోస్ట్.. “మ‌న్న‌త్” అని అడిగారు? “ఎస్.. ముందు ఆ ఆఫ‌ర్ నాకే వ‌చ్చింది. నేను అప్పుడే కెరీర్ స్టార్ట్ చేస్తున్నాను. మా నాన్న కొన‌కుండా ఆపేశారు. “అంత పెద్ద ఇంటిని ఏం చేసుకుంటావు?” అని అన్నారు” అని చెప్పారు స‌ల్మాన్ ఖాన్. “నేను ఇప్పుడు షారుక్ ఖాన్ ని అడుగుతున్నాను అంత పెద్ద ఇంటిని ఏం చేసుకుంటావు ?” అని అన్నారు స‌ల్మాన్ ఖాన్. పాత వీడియో వైర‌ల్ అవుతుండ‌టంతో ఫ్యాన్స్ ర‌క‌ర‌కాల కామెంట్లు పెడుతున్నారు. ఆ ఇల్లు తాము చూశామ‌ని, భ‌లే ఉంటుంద‌ని అని కొంత‌మంది త‌మ ఎక్స్ పీరియెన్స్ షేర్ చేసుకుంటున్నారు. 

వ‌జ్రాల నేమ్ ప్లేట్.. 

'మ‌న్న‌త్' చాలా అద్భుతంగా ఉంటుంది. అది దాదాపు రూ.200 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా. చాలాసార్లు షారుక్ ఖాన్ కూడా మ‌న్న‌త్ గురించి చెప్పారు. త‌న ద‌గ్గ‌రున్న ఎక్స్ పెన్సివ్ వస్తువుల్లో ఒక‌టి అని చెప్పారు. ఇక ముంబైలోని బంద్రాలో ఉండే ఈ ఇంటికి షారుక్ ఖాన్ భార్య‌, ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ గౌరి ఖాన్ డిజైన్ చేశారు. ఇక ఆ ఇంటికి ఉండే నేమ్ ప్లేట్ కూడా వ‌జ్రాల‌తో పొదిగి ఉంటుంది. ఆ నేమ్ ప్లేట్ కాస్ట్ రూ.25ల‌క్ష‌లు కాగా.. అది రాత్రి పూట ద‌గ ద‌గా మెరిసిపోతుంది. 

ఇక ఇదిలా ఉండ‌గా.. సినిమాల విష‌యాని వ‌స్తే.. షారుక్ ఖాన్ న‌టించిన సినిమా 'డంకీ' ఈ మ‌ధ్య రిలీజ్ అయ్యింది. దానికి రాజ్ కుమార్ హిరానీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర్వాత సుహానా ఖాన్ స‌ర‌స‌న 'కింగ్' సినిమాలో న‌టించ‌నున్నారు. సుహానా ఖాన్ కి ఈ సినిమా డెబ్యూ కాగా.. సుజ‌య్ ఘోష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 

ఇక స‌ల్మాన్ ఖాన్ విష‌యానికొస్తే.. ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తున్న 'సికంద‌ర్' సినిమాలో చేస్తున్నారు. ఈసినిమాని ఏఆర్ ముర్గ‌దాస్ డైరెక్ట్ చేస్తుండ‌గా.. వచ్చే ఏడాది రంజాన్ క‌ల్లా సినిమా రిలీజ్ చేయ‌నున్నారు. జూన్ లో షూట్ స్టార్ట్ అయ్యే అవ‌కాశం ఉంది. 

Also Read: దండిగా ‘హీరామండి’ రెమ్యునరేషన్స్, దర్శకుడికి ఎంతిచ్చారో తెలిస్తే షాకే!

Continues below advertisement